Axar Patel Becomes First Spinner To Achieve This Feat In IPL Since 2011 - Sakshi
Sakshi News home page

ఐపీఎల్ లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న అక్షర్ పటేల్..

Published Wed, Oct 6 2021 8:24 PM | Last Updated on Thu, Oct 7 2021 9:32 AM

Axar Patel Becomes First Spinner To Achieve This Feat In IPL Since 2011 - Sakshi

Courtesy: IPL

Axar Patel: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌  అక్షర్ పటేల్  అరుదైన రికార్డు సృష్టించాడు.  ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2021సెకెండ్‌ ఫేజ్‌ లో రెండు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ  అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అయితే వారి చివరి రెండు విజయాల్లో ఆ జట్టు  స్పిన్నర్ అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. ఈ లెఫ్టార్ట్ స్పిన్నర్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో గత రెండు మ్యాచులకు మ్యాన్ ఆఫ్ ది  మ్యాచ్  అవార్డు గెలుచుకున్నాడు.

అయితే  ఐపీఎల్‌లో ఒక స్పిన్నర్  ఇలా వరుసగా రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు గెలుచుకోవడం 2011 తర్వాత ఇదే  తొలిసారి. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ట్విట్టర్ లో పంచుకుంది. కాగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్‌ తో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో అక్షర్ పటేల్ రెండు కీలకమైన వికెట్లను పడగొట్టాడు.

చదవండిT20 World Cup: ఒమన్‌లో తుఫాను బీభత్సం.. టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లపై ప్రభావం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement