IPL 2021: Delhi Capitals Posted Beach Pictures Of Their Players Enjoying Themselves On An Off-day - Sakshi
Sakshi News home page

IPL 2021: మస్తుగా ఎంజాయ్‌ చేస్తున్న పంత్‌ సేన.. ఫొటోలు వైరల్‌!

Published Wed, Oct 6 2021 3:51 PM | Last Updated on Wed, Oct 6 2021 5:07 PM

IPL 2021: Delhi Capitals Players Enjoying In Beach Shared Pics - Sakshi

Delhi Capitals Players Enjoying In Beach: చెన్నై సూపర్‌కింగ్స్‌పై గెలుపుతో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లు మస్తుగా ఎంజాయ్‌ చేస్తున్నారు. బీచ్‌ ఒడ్డున వాలీబాల్‌ ఆడుతూ... కుటుంబంతో సరదాగా గడుపుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.


Photo Credit: Delhi Capitals Twitter

కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ సహా... శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, అశ్విన్‌, స్టీవ్‌స్మిత్‌ సాగర తీరంలో ఉల్లాసంగా గడుపుతున్నారు. తమ క్రికెటర్ల ఔటింగ్‌కు సంబంధించిన ఫొటోలను ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. 


Photo Credit: Delhi Capitals Twitter

ఈ నేపథ్యంలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘గతంలోనే టైటిల్‌ చేజారింది. ఇప్పుడు మాత్రం కచ్చితంగా ఫైనల్‌ చేరి కప్‌ గెలవాలి. ఆల్‌ ది బెస్ట్‌’’అంటూ డీసీ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తుండగా.. ‘‘బయో బబుల్‌ నిబంధనలు ఏమయ్యాయి’’ అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కాగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 3 వికెట్ల తేడాతో గెలుపొంది... పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే.


​​​​​​​Photo Credit: Delhi Capitals Twitter

చదవండి: T20 World Cup 2021: ఈ ఐదు తొలిసారిగా.. సరికొత్తగా.. ఆసక్తికర విశేషాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement