
Photo Courtesy: KKR Twitter
తొలి అంచెలో ఘోరమైన ప్రదర్శన కనబరిచిన సమయంలో జట్టులో జోష్ నింపేందుకు ప్రయత్నించాడు
Brendon McCullum Comments: ‘‘ఒక్కసారి అన్నీ గుర్తుకు తెచ్చుకోండి.. ఏడు మ్యాచ్‌లలో కేవలం రెండే విజయాలు. ఆ ప్రయాణాన్ని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. మీరు చెప్పబోయే స్ఫూర్తిదాయక కథల గురించి ఊహించుకోండి. మీ అనుభవాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. మన ముందున్న లక్ష్యం అదే. మనల్ని ఉత్తేజపరిచి... ఎగ్జైట్‌మెంట్‌కు గురిచేసేది అదే. మనం పెద్దగా కోల్పోయేదేం లేదు. అదే మనల్ని మరింత ప్రమాదకరంగా మార్చే అంశం’’- కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్... జట్టును ఉద్దేశించి ఈ మేరకు ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపాడు.
తొలి అంచెలో ఘోరమైన ప్రదర్శన కనబరిచిన సమయంలో జట్టులో జోష్ నింపేందుకు ప్రయత్నించాడు. ఆ మాటలను నిజం చేస్తూ... కేకేఆర్ ఆటగాళ్లు రెండో అంచెలో అద్భుత ప్రదర్శనను కనబరిచి... వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకువచ్చారు. ఇక అక్టోబరు 15న చెన్నై సూపర్‌కింగ్స్‌తో టైటిల్ పోరుకు సిద్ధమవుతున్న సమయంలో ఫ్రాంఛైజీ మెకల్లమ్ స్పీచ్ వీడియోను షేర్ చేసింది. అభిమానులను ఈ వీడియో విపరీతంగా ఆకర్షిస్తోంది.
కాగా కోవిడ్ కారణంగా ఐపీఎల్-2021 సీజన్ వాయిదా పడే నాటికి ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం రెండింట మాత్రమే గెలుపొందిన కేకేఆర్.. పాయింట్ల పట్టికలో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. అయితే, సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా రెండో అంచె ప్రారంభమైన తర్వాత... కోల్‌కతా రాత మారింది. ఏడు మ్యాచ్‌లలో విజయం సాధించి సగర్వంగా ఫైనల్‌లో అడుగుపెట్టింది.
చదవండి: IPL 2021 Final Today: ఆ జట్టుదే పైచేయి... ముందు ఫీల్డింగ్ ఎంచుకుంటే గెలుపు ఖాయమా?
Tonight's our 𝙩𝙧𝙮𝙨𝙩 𝙬𝙞𝙩𝙝 𝙙𝙚𝙨𝙩𝙞𝙣𝙮! 💜#KKR #CSKvKKR #AmiKKR #KorboLorboJeetbo #আমিKKR #IPL2021 pic.twitter.com/X0u50MHBR0
— KolkataKnightRiders (@KKRiders) October 15, 2021