Michael Vaughan Lashes Out At RCB Management: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ జట్టు తీసుకున్న నిర్ణయాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పెదవి విరిచాడు. బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేదని, అయితే ఈ మ్యాచ్‌లో ఓటమి వారికి ఒక విధంగా మంచే చేసిందన్నాడు. ఇప్పటికైనా... లోపాలు సరిదిద్దుకోవాలని సూచించాడు. కాగా ఇప్పటికే ప్లే ఆఫ్ చేరిన ఆర్సీబీ, ఈ సీజన్‌లో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకొన్న తొలి జట్టు సన్‌రైజర్స్ మధ్య బుధవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో విలియమ్సన్ సేన 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. దీంతో... పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగుపరచుకుని పటిష్ట స్థితిలో ఉండాలనుకున్న కోహ్లి సేనకు షాక్ తగిలింది.
ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ స్పందిస్తూ... ఆర్సీబీ తీరును తప్పుబట్టాడు. ముఖ్యంగా హిట్టర్ డివిల్లియర్స్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడమేంటని విమర్శించాడు. ఈ మేరకు... ‘‘ఓడిపోవడం ఆర్సీబీకి మంచిదైంది. ఇప్పటికైనా వారి బ్యాటింగ్ ఆర్డర్ మరీ అంత గొప్పగా ఏమీ లేదని తెలిసి వచ్చింది. డాన్ క్రిస్టియన్(డానియల్ క్రిస్టియన్)ను మూడో స్థానంలో అస్సలు బ్యాటింగ్‌కు పంపకూడదు. 35 బంతులు మిగిలి ఉన్న సమయంలో ఏబీ డివిల్లియర్స్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అది అస్సలు సరికాదు. 60 బంతుల్లో సెంచరీ చేయగల సమర్థుడు తను. తనను ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌కు పంపితే.. మ్యాచ్‌ను గెలిపించేవాడు. గ్లెన్ మాక్స్‌వెల్ మూడో స్థానంలో, డివిల్లియర్స్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి’’ అని అభిప్రాయపడ్డాడు.
స్కోర్లు:
హైదరాబాద్: 141/7 (20)
బెంగళూరు: 137/6 (20)
Comments
Please login to add a commentAdd a comment