David Warner: చాలా రోజుల తర్వాత కనిపించిన వార్నర్‌.. ఏంటన్నా ఇది! | IPL 2021 KKR Vs SRH: David Warner Waves SRH Flag From Stands Watch | Sakshi
Sakshi News home page

David Warner: మైదానంలో వార్నర్‌.. ఏంటన్నా ఇదంతా.. వచ్చే సీజన్‌లో...

Published Mon, Oct 4 2021 12:55 PM | Last Updated on Mon, Oct 4 2021 1:49 PM

IPL 2021 KKR Vs SRH: David Warner Waves SRH Flag From Stands Watch - Sakshi

David Warner(Photo Credit: IPL/BCCI)

David Warner in Stadium Viral Video: ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌కు భారత్‌లో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్నర్‌.. తనదైన ఆటతో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టాడు. 2016లో హైదరాబాద్‌ను ఐపీఎల్‌ విజేతగా నిలిపి తొలి టైటిల్‌ అందించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ‘వార్నర్‌ అన్న’.. కనిపిస్తే చాలు ఆరెంజ్‌ ఆర్మీలో జోష్‌ వస్తుంది. కానీ, ఈ సీజన్‌లో మాత్రం వార్నర్‌ మెరుపులు లేవు. కెప్టెన్సీ కాదు కదా తుదిజట్టులో కూడా అతడికి చోటు దక్కడం లేదు.

ముఖ్యంగా యూఏఈ వేదికగా జరుగుతున్న రెండో అంచెలో గత రెండు మ్యాచ్‌లలో కనీసం అతడు మైదానంలో కూడా కనిపించలేదు. దీంతో.. చాంపియన్‌ను ఇలా పెట్టడం సరికాదంటూ అభిమానులు ఇప్పటికే ఫ్రాంఛైజీ తీరును తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో.. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ను స్టేడియంలో చూసి ఫ్యాన్స్‌ సంబరపడిపోయారు. సిబ్బందితో కలిసి ఎస్‌ఆర్‌హెచ్‌ జెండా ఊపుతూ... జట్టును ఉత్సాహపరుస్తూ కనిపించాడు వార్నర్‌.

ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ క్రమంలో... ‘‘వార్నర్‌ భాయ్‌ నిన్ను చూసినందుకు సంతోషంగా ఉంది. అదే సమయంలో బాధగా ఉంది. నీలాంటి చాంపియన్‌ ఇలా డగౌట్‌లో కూర్చోవడం ఏంటన్నా. టాప్‌క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌కు ఇది నిజంగా ఎంతో బాధాకరమైన పరిస్థితి’’ అని ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ ట్వీట్‌ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు.. ‘‘వచ్చే సీజన్‌లో వార్నర్‌ చెన్నై లేదంటే ఆర్సీబీకి ఆడటం ఖాయం’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా మళ్లీ ఆరెంజ్‌ జెర్సీలో కనిపించకపోవచ్చంటూ వార్నర్‌ ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే!

చదవండి: Glenn Maxwell: నేను అన్నది ఐపీఎల్‌లో కాదు.. విఫలమయ్యానని తెలుసు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement