టీమిండియా క్యాప్‌ పెట్టుకున్నారు.. ఇంకెందుకు ఆడుతారు | Suryakumar And Ishan Kishan Not Intrest Batting After Getting India Cap | Sakshi

T20 World Cup 2021: టీమిండియా క్యాప్‌ పెట్టుకున్నారు.. ఇంకెందుకు ఆడుతారు

Oct 5 2021 4:21 PM | Updated on Oct 5 2021 8:51 PM

Suryakumar And Ishan Kishan Not Intrest Batting After Getting India Cap - Sakshi

Sunil Gavaskar Slams Surya Kumar Yadav And Ishan Kishan.. ముంబై ఇండియన్స్‌ తరపున ఆడుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌లు ఐపీఎల్‌ 2021 సీజన్‌ సెకండ్‌ఫేజ్‌లో చెత్త ప్రదర్శన కనబరుస్తున్నారు. గత ఐదు ఇన్నింగ్స్‌లో  సూర్యకుమార్‌ వరుసగా 3,5,8,0,33 పరుగులు చేసి నిరాశపరిచాడు. మరో పక్క ఇషాన్‌ కిషన్‌ ప్రదర్శన కూడా దారుణంగా ఉంది. తన చివరి మూడు ఇన్నింగ్స్‌ల్లో 11,14, 9 పరుగులు చేశాడు. కాగా టి20 ప్రపంచకప్‌కు టీమిండియాలో ఈ ఇద్దరు చోటు దక్కించుకున్నారు. కాగా వీరు ఫామ్‌లో లేకపోవడం సెలక్టర్లకు ఆందోళన కలిగిస్తుంది. అక్టోబర్‌ 10 వరకు సమయం ఉండడంతో టీమిండియా జట్టులో మార్పులు చేసే అవకాశం ఉందంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్‌.. దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: IPL 2021: ఢిల్లీ క్యాపిటల్స్‌ సెలబ్రేషన్స్‌లో 'క్రిస్టియానో రొనాల్డొ'


''టీమిండియా జట్టులోకి ఎంపికైన తర్వాత ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌లు ఎందుకో రిలాక్స్‌ మోడ్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది. వారి ఆటతీరులో ఇది స్ఫష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో ఏదో మొక్కుబడికి ఆడినట్లుగా వారి షాట్‌ సెలక్షన్‌లో కనిపిస్తుంది. బహుశా టీమిండియా క్యాప్‌ ధరించినందుకు అలా ఆడుతున్నట్లున్నారు. షాట్‌ సెలక్షన్‌ ఎంపికలో కొంచెం టైమ్‌ తీసుకొని ఆడితే బాగుంటుంది. కానీ వీరిద్దరు అదేం పట్టనట్టుగా తమకు నచ్చినరీతిలో ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. అందుకే ఐపీఎల్‌లో అనవసరంగా భారీ షాట్లకు పోయి వికెట్లు ఇచ్చేసుకుంటున్నారు. ఇదే రీతిలో ఆటను కొనసాగిస్తే త్వరలోనే టీమిండియా జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉంటుంది.

చదవండి: T20 World Cup: కోహ్లి సేనకు అంత సీన్‌ లేదు.. మాకు అసలు పోటీనే కాదు: పాక్ మాజీ ప్లేయ‌ర్‌

ఇక హార్దిక్‌ పాండ్యా ఐపీఎల్‌లో బౌలింగ్‌ చేయకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. టి20 ప్రపంచకప్‌లో అతను ఎంపికైంది ఆల్‌రౌండర్‌ కోటాలో.. జట్టులో ఆరు లేదా ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చే పాండ్యా బౌలింగ్‌లోనూ ఎంతో కొంత ఉపయోగపడాలి. ఒకవేళ అతను టి20 ప్రపంచకప్‌లో బౌలింగ్‌ చేయనంటే క్యాప్టెన్‌కు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. హర్దిక్‌ విషయంలో టీమిండియా సెలక్టర్లు ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకోవాలి'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: MI Vs RR: ఒక్క మ్యాచ్‌.. నాలుగు రికార్డులు బద్దలయ్యే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement