courtesy: IPl Twitter
Umran Malik Fastest Ball IPL 2021.. ఐపీఎల్ 2021లో ఎస్‌ఆర్‌హెచ్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ మరోసారి మెరిశాడు. ఇంతకముందు కేకేఆర్‌తో మ్యాచ్‌లో గంటకు 150 కిమీ బంతి విసిరి చరిత్ర సృష్టించిన ఉమ్రాన్ తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 19వ ఓవర్ మూడో బంతిని ఉమ్రాన్ మాలిక్ ఏకంగా గంటకు 152.95 వేగంతో విసిరి రికార్డు సృష్టించాడు. లోకీ ఫెర్గూసన్ రికార్డును బ్రేక్ చేస్తూ ఈ సీజన్‌లో కొత్త రికార్డు నెలకొల్పాడు. అయితే ఉమ్రాన్ మాలిక్ విసిరిన బంతి వేగంగా వచ్చి సూర్యకుమార్ హెల్మెట్‌కు బలంగా తగలడంతో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. దెబ్బకు హెల్మెట్ తీసి చెక్ చేసుకున్న సూర్య.. కాసేపటి తర్వాత బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అప్పటికే మంచి టచ్‌లో కనిపించిన సూర్య ఆ తర్వాత మరో నాలుగు బంతులాడి పెవిలియన్ చేరాడు.
కాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (84) సూర్యకుమార్ యాదవ్(82) పరుగులతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. తొలి 10 ఓవర్లలో 132 పరుగులు చేసిన ముంబై చివరి 10 ఓవర్లలో 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో హోల్డర్ 4, రషీద్ ఖాన్ 2, ఉమ్రాన్ మాలిక్ 1 వికెట్ తీశారు.
— Rishobpuant (@rishobpuant) October 8, 2021
Comments
Please login to add a commentAdd a comment