Courtesy: IPL Twitter
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ 2021 సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఓవర్ మూడో బంతిని ఉమ్రాన్ గంటకు 150 కిమీ వేగంతో విసిరాడు. బంతిని టచ్ చేసిన శుబ్‌మన్ గిల్ బ్యాట్ పక్కకు తిరిగిదంటేనే అర్థం చేసుకోవచ్చు.. బంతి ఎంత వేగంగా వచ్చిందనేది. ఇక ఉమ్రాన్ మాలిక్‌కు ఐపీఎల్‌లో ఇదే డెబ్యూ మ్యాచ్ కావడం విశేషం. భారత్ తరపున ఈ సీజన్‌లో అత్యంత ఫాస్ట్ డెలివరీ వేసిన జాబితాలో ఉమ్రాన్ తొలి స్థానంలో నిలవగా.. మహ్మద్ సిరాజ్- ఆర్‌సీబీ (గంటకు 147.68కిమీ, 147.67కిమీ) రెండోస్థానంలో.. ఖలీల్ అహ్మద్( గంటకు 147.38కిమీ) మూడో స్థానంలో ఉన్నాడు.
చదవండి: IPL 2021: హర్షల్ పటేల్ సూపర్ త్రో.. మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్; కోహ్లి గెంతులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ విజయం దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. గిల్ 57, నితీష్ రాణా 18 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 44 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గిల్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.
చదవండి: కేఎల్ రాహుల్ కొత్త చరిత్ర.. వరుసగా నాలుగోసారి
WATCH: Umran Malik bowled a 1️⃣5️⃣0️⃣ KMPH delivery 🔥⚡🤯
— IndianPremierLeague (@IPL) October 3, 2021
On #VIVOIPL debut and he showcases his FULL PACE 🔝💪🏻 #KKRvSRH @SunRisers
🎥 👇https://t.co/fg8HrKrwnI
Comments
Please login to add a commentAdd a comment