
విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న కారణంగా తన శరీరం కాస్త ఇబ్బంది పెడుతోందని, అందుకే తానే విశ్రాంతి అడిగానని భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు. వంద శాతం ఫిట్‌గా ఉండి తాను పూర్తి స్థాయిలో ఆడగలనని భావించినప్పుడే బరిలోకి దిగాలనేదే తన ఉద్దేశమని, విరామ సమయంలో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు 24 ఏళ్ల పాండ్యా వెల్లడించాడు.
శ్రీలంకతో తొలి రెండు టెస్టులకు జట్టులోకి ఎంపిక చేసి కూడా సెలక్టర్లు ఆ తర్వాత విశ్రాంతి పేరుతో పాండ్యాను పక్కన పెట్టడం విమర్శలకు దారి తీసింది.
Comments
Please login to add a commentAdd a comment