నేటి నుంచి భారత దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ మొదలు | Duleep Trophy 2024: Full schedule | Sakshi
Sakshi News home page

నేటి నుంచి భారత దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ మొదలు

Published Thu, Sep 5 2024 7:52 AM | Last Updated on Thu, Sep 5 2024 4:31 PM

Duleep Trophy 2024: Full schedule

దులీప్‌ ట్రోఫీతో ఆరంభం

 బెంగళూరు వేదికగా భారత్‌ ‘ఎ’తో భారత్‌ ‘బి’ ఢీ

 అనంతపురంలో భారత్‌ ‘సి’, భారత్‌ ‘డి’ మధ్య పోరు

బరిలో టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు

ఉదయం గం. 9:30 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం  

బెంగళూరు: భారత జట్టు అంతర్జాతీయ సీజన్‌ ప్రారంభానికి రెండు వారాల ముందుగానే 2024–2025 దేశవాళీ క్రికెట్‌ సీజన్‌కు తెర లేవనుంది. ఇందులో భాగంగా గురువారం దులీప్‌ ట్రోఫీ తొలి రౌండ్‌ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ జట్టుతో భారత్‌ ‘బి’  జట్టు... అనంతపురంలో నిర్వహించనున్న మరో మ్యాచ్‌లో భారత్‌ ‘సి’ జట్టుతో భారత ‘డి’ జట్టు తలపడనున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు టీమిండియా మరో 10 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా... ఈ టోరీ్నలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. 

భారత కెపె్టన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజాకు ఈ టోర్నీ నుంచి విశ్రాంతినివ్వగా... మిగిలిన యువ ఆటగాళ్లందరూ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. రిషభ్‌ పంత్‌... చాన్నాళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడనున్నాడు. టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలనుకుంటున్న శుభ్‌మన్‌ గిల్‌ భారత ‘ఎ’ జట్టుకు సారథ్యం వహిస్తుండగా... మరో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ భారత్‌ ‘బి’ నుంచి బరిలోకి దిగనున్నాడు. 

ఈ టోర్నీని జాతీయ సెలెక్టర్లు నిశితంగా పరిశీలించనున్న నేపథ్యంలో ఆటగాళ్లంతా తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఉవి్వళ్లూరుతున్నారు. మిడిలార్డర్‌ ప్లేయర్లు కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్‌ జురెల్‌పై ప్రధానంగా దృష్టి ఉంటుంది. సీనియర్‌ పేసర్‌ షమీ శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటుండగా... సిరాజ్‌ అనారోగ్యంతో టోరీ్నకి దూరమయ్యాడు. బుమ్రా కూడా అందుబాటులో లేకపోవడంతో మెరుగైన ప్రదర్శన కనబర్చిన పేసర్లకు ప్రత్యేక గుర్తింపు దక్కడం ఖాయమే. దీంతో ముకేశ్‌ కుమార్, ఆకాశ్‌దీప్,    అర్‌‡్షదీప్‌ సింగ్, అవేశ్‌ ఖాన్, ఖలీల్‌ అహ్మద్, విద్వత్‌ కావేరప్ప, విజయ్‌ కుమార్, హర్షిత్‌ రాణాలపై సెలెక్టర్లు దృష్టి సారించనున్నారు. స్పిన్‌ విభాగంలో సత్తా చాటేందుకు అక్షర్‌ పటేల్, కుల్దీప్‌ యాదవ్, వాషింగ్టన్‌ సుందర్, సాయికిశోర్, సౌరభ్‌ కుమార్, మానవ్‌ సుతార్‌ సిద్ధంగా ఉన్నారు.  

ఇషాన్‌ కిషన్‌ అవుట్‌ 
దేశవాళీ టోర్నీల్లో ఆడని కారణంగా బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టు కోల్పోయిన యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌... దులీప్‌ ట్రోఫీ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఆడటం లేదు. కండరాల నొప్పితో బాధపడుతున్న ఇషాన్‌... భారత ‘డి’ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అనంతపురం వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో భారత్‌ ‘సి’తో భారత్‌ ‘డి’ ఆడుతుంది. దీంతో గురువారం ప్రారంభం కానున్న పోరులో భారత్‌ ‘డి’ తరఫున ఆంధ్ర ఆటగాడు శ్రీకర్‌ భరత్‌ వికెట్‌ కీపర్‌గా వ్యవహరించే అవకాశాలున్నాయి. మరోవైపు భారత్‌ ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పేసర్‌ ప్రసిధ్‌ కృష్ణ కూడా శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీంతో అతడు కూడా తొలి రౌండ్‌ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ఇషాన్‌ స్థానంలో సంజూ సామ్సన్‌ను జట్టులోకి తీసుకున్నారు.

జట్లు 
భారత్‌ ‘ఎ’: శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్, రియాన్‌ పరాగ్, ధ్రువ్‌ జురెల్, కేఎల్‌ రాహుల్, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే, తనుశ్‌ కొటియాన్, కుల్దీప్‌ యాదవ్, ఆకాశ్‌దీప్, ఖలీల్‌ అహ్మద్, అవేశ్‌ ఖాన్, విద్వత్‌ కావేరప్ప, కుమార్‌ కుశాగ్ర, శాశ్వత్‌. 

భారత్‌ ‘బి’: అభిమన్యు ఈశ్వరన్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్‌ ఖాన్, రిషభ్‌ పంత్, ముషీర్‌ ఖాన్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి (ఫిట్‌నెస్‌ సాధిస్తేనే), వాషింగ్టన్‌ సుందర్, నవ్‌దీప్‌ సైనీ, యశ్‌ దయాల్, ముకేశ్‌ కుమార్, రాహుల్‌ చహర్, సాయి కిశోర్, మోహిత్‌ అవస్తి, జగదీశన్‌. 

భారత్‌ ‘సి’: రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్‌), సాయి సుదర్శన్, రజత్‌ పటిదార్, అభిషేక్‌ పొరెల్, ఇంద్రజీత్, హృతిక్‌ షోకీన్, మానవ్‌ సుతార్, గౌరవ్‌ యాదవ్, విజయ్‌కుమార్, అన్షుల్, హిమాన్షు చౌహాన్, మయాంక్‌ మార్కండే, అర్యాన్‌ జుయల్, సందీప్‌ వారియర్‌. 

భారత్‌ ‘డి’: శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), అథర్వ తైడె, యశ్‌ దూబే, దేవదత్‌ పడిక్కల్, సంజూ సామ్సన్, రికీ భుయ్, సారాంశ్‌ జైన్, అక్షర్‌ పటేల్, అర్‌షదీప్, ఆదిత్య థాక్రే, హర్షిత్‌ రాణా, తుషార్, ఆకాశ్‌ సేన్‌ గుప్తా, శ్రీకర్‌ భరత్, సౌరభ్‌ కుమార్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement