దుబాయ్: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌లు ఐసీసీ ప్రపంచ ఎలెవన్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ జట్టు ఈ నెల 31న లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరిగే టి20 మ్యాచ్‌లో తలపడుతుంది. గతేడాది హరికేన్ బీభత్సంతో కరీబియన్ స్టేడియాలకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది.
ధ్వంసమైన స్టేడియాలను నవీకరించడానికి నిధుల సేకరణ కోసం ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ప్రతి దేశం నుంచి ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నారు. ఈ టి20కి ఐసీసీ ఇదివరకే అంతర్జాతీయ హోదా ఇచ్చింది. పాక్ తరఫున అఫ్రిది, షోయబ్ మాలిక్, బంగ్లాదేశ్ నుంచి షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్, లంక నుంచి తిసార పెరీరా, అఫ్గానిస్తాన్ నుంచి రషీద్ ఖాన్ ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment