IND Vs AFG Intresting Facts.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయాన్ని సాధించి భోణీ కొట్టింది. సెమీస్ అవకాశాలు దాదాపు కోల్పోయినప్పటికీ ఈ మ్యాచ్‌లో టీమిండియాకు తప్పక విజయం కావాలి. అలాంటి కీలకమైన మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై విజయాన్ని అందుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు వందల మార్క్‌ను దాటింది.
ఈ టి20 ప్రపంచకప్‌లో 200 స్కోరును కొట్టిన తొలి జ్టటుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. కాగా టీమిండియా టి20 ప్రపంచకప్‌లో రెండు వందల మార్క్‌ను దాటడం ఇది రెండోసారి. ఇంతకముందు 2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ దెబ్బకు టీమిండియా 218 పరుగుల స్కోరును నమోదు చేసింది. అయితే అఫ్గాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులు అందుకున్నారు. వాటిని ఒకసారి పరిశీలిద్దాం.
చదవండి: T20 WC 2021: సెమీస్ చేరడం కష్టమే.. కానీ అదొక్కటే దారి
విరాట్ కోహ్లి
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టి20 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోవడం ఇది 30వ సారి. కాగా విండీస్ మాజీ కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ కూడా టి20ల్లో 30సార్లు టాస్ ఓడిపోయాడు. అయితే కోహ్లి టాస్ ఓడినా విజయాల శాతంలో కోహ్లి 37.5శాతంతో.. బ్రాత్‌వైట్‌ను(36.67%) అధిగమించాడు. ఇక 2020 నుంచి చూసుకుంటే కోహ్లి 41 మ్యాచ్‌ల్లో 31సార్లు టాస్ ఓడిపోవడం విశేషం.
రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్:
టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు అరుదైన రికార్డు అందుకున్నారు. అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. టి20 ప్రపంచకప్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇక టి20 ప్రపంచకప్‌ల్లో ఇంతవరకు టీమిండియాకు నాలుగు సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. అంతేకాదు టి20ల్లో టీమిండియాకు 23 సెంచరీ భాగస్వామ్యాలు ఉంటే అందులో 12 సార్లు రోహిత్ శర్మ ఉండడం మరో విశేషం.
చదవండి: Virat Kohli- Rohit Sharma: కోహ్లిపై రోహిత్, అశ్విన్ ప్రశంసల వర్షం; అస్సలు ఊహించలేదన్న విరాట్
రిషబ్ పంత్- హార్దిక్ పాండ్యా
అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో హిట్టర్స్ రిషబ్ పంత్(27 పరుగులు), హార్దిక్ పాండ్యా(35 పరుగులు) దుమ్మురేపారు. ఓపెనర్లు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఈ ఇద్దరు కేవలం 21 బంతుల్లోనే 63 పరుగులు చేశారు. తక్కువ బంతుల్లో(18).. 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఈ జంట ధోని.. యువరాజ్ రికార్డును బ్రేక్ చేశారు. 2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ధోని- యువరాజ్ ద్వయం 19 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇదే మ్యాచ్‌లో యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
మహ్మద్ షమీ
తన ఏడున్నర సంవత్సరాల కెరీర్‌లో షమీ ఆడిన టి20 మ్యాచ్‌ల సంఖ్య 15. ఇక అఫ్గాన్‌తో మ్యాచ్‌లో షమీ 4-0-32-3తో టి20 కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు సాధించాడు. ఇంతకముందు 2014లో బర్మింగ్‌హమ్‌లో 4 ఓవర్లు వేసిన షమీ 3 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
రోహిత్ శర్మ
అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ(47 బంతుల్లో 74 పరుగులు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా టి20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 50 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది ఏడోసారి. ఓవరాల్‌గా 11వ స్థానంలో ఉన్న రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎక్కువసార్లు అందుకున్న జాబితాలో షాహిద్ అఫ్రిది, మహ్మద్ హఫీజ్‌లతో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఇక అఫ్గానిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ(13 సార్లు), టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(12 సార్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
చదవండి: T20 WC 2021 IND Vs AFG: ఎట్టకేలకు గెలిచాం.. ఆపై నిలిచాం
Comments
Please login to add a commentAdd a comment