
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు భారత పేసర్ మహ్మద్ షమీ ఆదిలోనే షాకిచ్చాడు.
గువాహటి : భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు భారత పేసర్ మహ్మద్ షమీ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ హెమరాజ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హోప్‌తో కీరన్ పావెల్ దాటిగా ఆడటంతో విండీస్ 10 ఓవర్లకు వికెట్ నష్టపోయి 59 పరుగులు చేసింది. ఈ క్రమంలో కీరన్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రమాదకరంగా మారిన కీరన్‌ను యువ బౌలర్ ఖలీల్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు.
దీంతో రెండో వికెట్‌కు నమోదైన 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే షమీ హోప్‌ను.. చహల్ సామ్యుల్‌ను ఔట్ చేయడంతో విండీస్ 114 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో హెట్‌మెయిర్(42), రోవ్‌మన్ పావెల్(7)లున్నారు.