
జోరూట్ రనౌట్
సౌతాంప్టన్ : భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీ విరామ సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. 6/0 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్ల దెబ్బతీశారు. భారత పేసర్ల దాటికి ఇంగ్లండ్ 122 పరుగులకే కీలక ఐదు వికెట్లు కోల్పోయింది. వరుస వికెట్లు పోతున్నా జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన జోరూట్(48)ను మహ్మద్ షమీ సూపర్ ఫీల్డింగ్‌తో రనౌట్ చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో జెన్నింగ్స్(36) మినహా అందరూ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. బెన్ స్టోక్స్ 20(79), జోస్ బట్లర్ 22(39) పరుగులతో క్రీజులో ఉన్నారు. షమీకి రెండు వికెట్లు దక్కగా.. ఇషాంత్, బుమ్రాలకు తలో వికెట్ దక్కింది.