భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ మోకాలి గాయంనుంచి పూర్తిగా కోలుకున్నాడు. వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉంటాడని జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది.
పెర్త్: భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ మోకాలి గాయంనుంచి పూర్తిగా కోలుకున్నాడు. వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉంటాడని జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. గాయం కారణంగా షమీ యూఏఈతో మ్యాచ్ ఆడని విషయం తెలిసిందే. మంగళవారం ఇక్కడి మర్డోక్ యూనివర్సిటీ మైదానంలో జరిగిన భారత ప్రాక్టీస్ సెషన్‌లో షమీ చురుగ్గా పాల్గొన్నాడు. బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా చేశాడు.
అయితే మరో పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫిట్‌నెస్‌పై మరోసారి సందేహం నెలకొంది. చీలమండకు పెద్దగా ప్లాస్టర్‌లు చుట్టుకొని అతను ప్రాక్టీస్‌లో కనిపించాడు. అయితే గాయం తగ్గలేదా, లేక ముందు జాగ్రత్తగా అలా చేశాడా అనేదానిపై స్పష్టత లేదు.