Pakistan Behind Shami Trolling: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్ ముగిసి రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఏదో ఒక వార్త సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా నడుస్తూనే ఉంది. తాజాగా షమీపై ట్రోలింగ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాక్‌ల మధ్య అక్టోబర్ 24న జరిగిన హై ఓల్టేజ్ పోరులో పాక్ 10 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ(3.5 ఓవర్లలో 43 పరుగులు)ని టార్గెట్ చేస్తూ కొందరు దురభిమానులు సోషల్‌మీడియా వేదికగా తీవ్ర పదజాలంతో ట్రోలింగ్‌కు దిగారు.
అయితే, ఈ ట్రోలింగ్ పాకిస్థాన్ నుంచే మొదలైందని తాజా పరిశోధనలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ ట్రోల్స్ అన్నీ పాక్‌కు చెందినవారే చేశారని, మత విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడ్డారని ఆధారాలతో సహా బహిర్గతమైంది. ఇందుకు సంబంధించి పలు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను సైతం గుర్తించారు. వాటి నుంచే షమీపై విష ప్రచారం మొదలైందనట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. కాగా, ఈ విషయమై షమీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకులు, ప్రముఖులు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.
చదవండి: De Kock: తగ్గేదేలే అన్నాడు.. ఇప్పుడేమో దిగొచ్చాడు..!
Comments
Please login to add a commentAdd a comment