
షమీతో హసిన్ జహాన్ (పాత ఫోటో)
సాక్షి, ముంబై : టీమిండియా పేసర్ షమీ వ్యవహారం పూట పూటకు కొత్త మలుపు తిరుగుతోంది. భార్య హసిన్ జహాన్ షమీపై సంచలన ఆరోపణలకు దిగారు. తన సోదరుడితో శృంగారంలో పాల్గొనాలని షమీ తనపై ఒత్తిడి తెచ్చేవాడని హసిన్ చెబుతున్నారు.
‘ఓరోజు హసీబ్(షమీ సోదరుడు) ఉన్న గదిలోకి షమీ నన్ను తోసేసి గదికి బయట గడి వేశాడు. లోపల హసిబ్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచారం చెయ్యబోయాడు. నేను గట్టిగా కేకలు వేయటంతో షమీ కంగారుపడి తలుపులు తెరిచాడు’ అని జహాన్ మీడియాకు తెలిపారు. షమీ కుటుంబ సభ్యులంతా తనపై దాడులకు పాల్పడే వారని ఆమె అంటున్నారు. అంతేకాదు షమీతో జరిపిన ఫోన్ సంభాషణలను కూడా ఆమె మీడియాకు వినిపించారు. అందులో పలువురు మహిళలతో తనకు సంబంధం ఉన్నట్లు అతని నోటి నుంచే చెప్పటం ఉంది.
షమీ వివాహేతర సంబంధాలు బయటపెట్టడం దగ్గరి నుంచి మొదలైన ఈ వ్యవహారం శుక్రవారం ఆమె కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రసవత్తరంగా మారింది. గృహ హింస చట్టం ప్రకారం షమీపై కేసు నమోదు అయ్యింది. అత్యాచార యత్నం.. వేధింపులు... వివాహేతర సంబంధాలు తదితర ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అయితే హసిన్ ఆరోపణలు చేస్తోందంటూ షమీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment