టి20 ప్రపంచకప్‌లో బుమ్రా స్థానంలో ఎంపికైన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అంచనాలకు మించి రాణించాడు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఆరు ఎకానమీతో ఆరు వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబరిచాడు. మిడిల్ ఓవర్లలో హార్దిక్ పాండ్యాతో కలిసి బౌలింగ్ పంచుకుంటున్న షమీ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టుకు బ్రేక్ అందిస్తున్నాడు.
ఇక సూపర్ -12 దశ మ్యాచ్‌లు ముగియగా.. టీమిండియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్‌లు సెమీ ఫైనల్ చేరుకున్నాయి. బుధవారం న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య తొలి సెమీస్ జరగనుండగా.. రెండో సెమీస్ టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య గురువారం(నవంబర్ 10న) జరగనుంది. ఈ నేపథ్యంలో సెమీస్ మ్యాచ్‌లకు కాస్త విరామం దొరకడంతో మహ్మద్ షమీ ఆస్ట్రేలియా అడవి బాట పట్టాడు.
అడ్వెంచరస్ ప్రయాణాలను బాగా ఇష్టపడే షమీ ఖాళీ సమయం దొరికితే చాలు ఒక్కడే అడవుల్లోకి వెళ్లి ప్రకృతిని ఆస్వాధించడం అలవాటు చేసుకున్నాడు . తాజాగా ఆసీస్ అడవుల్లో చక్కర్లు కొట్టిన షమీ దానికి సంబంధించిన ఫోటోలను తన ట్విటర్‌లో పంచుకున్నాడు. ''అడవిలో వైఫై కనెక్షన్ ఉండకపోవచ్చు.. కానీ మీకు బెస్ట్ కనెక్షన్ దొరుకుతుందని నేను ప్రామిస్ చేయగలను'' అంటూ క్యాప్షన్ జత చేశాడు.
There's no Wi-Fi in the forest, but I promise you'll find a better connection. #mdshami #mdshami11 #naturephotography #india #australia pic.twitter.com/1JRZn1I5NT
— Mohammad Shami (@MdShami11) November 8, 2022
చదవండి: అరివీర భయంకరులైన ఇంగ్లండ్ బ్యాటర్లను టీమిండియా బౌలర్లు అడ్డుకోగలరా..?
Comments
Please login to add a commentAdd a comment