
కోల్‌కతా: తన భర్తకు పలువురు అమ్మాయిలతో అక్రమ సంబంధాలున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేసిన టీమిండియా పేసర్ మహ్మద్ షమి భార్య హసీన్ జహాన్..గురువారం మరో బాంబు పేల్చింది. తన భర్త ఒక మ్యాచ్ ఫిక్సర్ అని వెల్లడించారు. పలు మ్యాచ్‌ల్లో షమీ ఫిక్సింగ్ పాల్పడ‍్డాడని జహార్ ఆరోపించింది. 'షమి నాతోపాటు దేశాన్నీ మోసగించగలడు. దుబాయ్‌లో అలీ సబా అనే పాకిస్థాన్ అమ్మాయి నుంచి డబ్బు తీసుకున్నాడు. అందుకు నా వద్ద ఆధారాలున్నాయి. ఇంగ్లండ్‌కు చెందిన మహ్మద్ భాయ్ సూచన మేరకు అతడు ఆ సొమ్ము స్వీకరించాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగానే ఆ డబ్బు తీసుకున్నాడు. ఒకవేళ కాకపోతే ఆ డబ్బు ఎందుకు తీసుకున్నాడో షమి వెల్లడించాలి. మహ్మద్ భాయ్ ఎవరో షమీ చెప్పాలి. అతనితో షమీకి ఏమిటి సంబంధం. భాయ్ అనే వ్యక్తి ఏమి చేస్తాడో ప్రపంచానికి చెప్పు' అని జహాన్ డిమాండ్ చేసింది.
గతనెల దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జట్టు సభ్యులంతా భారత్ వచ్చేయగా షమి దుబాయ్‌లో ఆగిన విషయాన్ని జహాన్ ఈ సందర్బంగా వెల్లడించారు. ఆ క్రమంలోనే ఎయిర్‌పోర్ట్‌లో పాక్‌కు చెందిన మహిళను కలుసుకున్నాడుని, ఫిబ్రవరి 18న ఆమెతో కలిసి అతడు ఓ హోటల్‌లో చెక్ ఇన్ అయినట్లు తెలిపింది. వీటిపై తాను నిలదీస్తే ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరింపులకు పాల్పడ్డాడని జహాన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment