CWC 2023 Winner Australia: క్రికెట్ మెగా సమరానికి తెరపడింది. భారత్ వేదికగా అక్టోబరు 5న మొదలైన వన్డే వరల్డ్‌కప్ పండుగ ఆదివారంతో ముగిసిపోయింది. అజేయ రికార్డుతో ఫైనల్ చేరిన టీమిండియా ట్రోఫీ గెలుస్తుందని కోటి ఆశలతో ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది.
అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో రోహిత్ సేనను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. అనూహ్య విజయాలతో తుదిపోరుకు అర్హత సాధించిన ప్యాట్ కమిన్స్ బృందం విజయంతో ఈ ఐసీసీ టోర్నీని ముగించి సగర్వంగా స్వదేశానికి వెళ్లనుంది.
ఇదిలా ఉంటే.. అసలు మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడు, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వంటి అవార్డులు గెలుచుకుంది.
ప్రపంచకప్-2023 టోర్నమెంట్లో వివిధ అవార్డులు అందుకున్న ప్లేయర్ల లిస్టు
1.ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ - విరాట్ కోహ్లీ- ఇండియా (765 పరుగులు, 1 వికెట్, 5 క్యాచ్‌లు)
2. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్- ట్రవిస్ హెడ్- ఆస్ట్రేలియా(137 పరుగులు, 1 క్యాచ్)
3.అత్యధిక పరుగులు- విరాట్ కోహ్లి(11 ఇన్నింగ్స్‌లో 765 పరుగులు)
4.అత్యధిక స్కోరు- గ్లెన్ మాక్స్‌వెల్(ముంబైలో అఫ్గనిస్తాన్ మీద 201 పరుగులు- నాటౌట్)
5. అత్యధిక సెంచరీలు- క్వింటన్ డికాక్- సౌతాఫ్రికా(4 శతకాలు)
6. అత్యధిక అర్ధ శతకాలు- విరాట్ కోహ్లి(6 ఫిఫ్టీలు)
7. అత్యధిక వికెట్లు- మహ్మద్ షమీ- ఇండియా(7 ఇన్నింగ్స్‌లో 24 వికెట్లు)
8. అత్యుత్తమ గణాంకాలు- మహ్మద్ షమీ(ముంబైలో న్యూజిలాండ్ మీద 7/57)
9. అత్యధిక సిక్సర్లు- రోహిత్ శర్మ- ఇండియా(31 సిక్స్‌లు)
10. అత్యధిక క్యాచ్‌లు- డారిల్ మిచెల్- న్యూజిలాండ్(11 క్యాచ్‌లు)
11. అత్యధిక అవుట్లు చేసిన వికెట్ కీపర్- క్వింటన్ డికాక్(20)
13. అత్యధిక స్ట్రైక్‌రేటు- గ్లెన్ మాక్స్‌వెల్(150.37)
పూర్తి వివరాలు- ఇతర విశేషాలు
►ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా భారత స్టార్ విరాట్ కోహ్లి నిలిచాడు. కోహ్లి 11 మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 765 పరుగులు సాధించాడు.
►ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భారత పేసర్ మొహమ్మద్ షమీ నిలిచాడు. షమీ 7 మ్యాచ్‌లు ఆడి మొత్తం 24 వికెట్లు పడగొట్టాడు. షమీ మొత్తం 48.5 ఓవర్లు వేసి 257 పరుగులు ఇచ్చాడు.
►మొత్తం ప్రపంచకప్ టోర్నీలలో అత్యధిక టీమ్ స్కోరు ఈ ప్రపంచకప్‌లోనే నమోదైంది. శ్రీలంకతో న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్లకు 428 పరుగులు సాధించింది.
►ధర్మశాలలో ఆ్రస్టేలియా (388 ఆలౌట్; 49.2 ఓవర్లలో), న్యూజిలాండ్ (50 ఓవర్లలో 383/9) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మొత్తం 771 పరుగులు వచ్చాయి. ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధికం.
►ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత నమోదు చేసిన బ్యాటర్‌గా ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్‌వెల్ నిలిచాడు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్స్‌లు) అజేయ డబుల్ సెంచరీ సాధించాడు.
►ఈ ప్రపంచకప్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా భారత పేసర్ మొహమ్మద్ షమీ నిలిచాడు. న్యూజిలాండ్‌తో ముంబైలో జరిగిన సెమీఫైనల్లో షమీ 57 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు.
►ఈ ప్రపంచకప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 400 అంతకంటే ఎక్కువ స్కోర్లు మూడుసార్లు నమోదయ్యాయి. శ్రీలంకపై దక్షిణాఫ్రికా (428/5), నెదర్లాండ్స్‌పై భారత్ (410/4), పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ (401/6) సాధించాయి.
►వన్డే వరల్డ్‌కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు గెల్చుకున్న మూడో భారతీయ క్రికెటర్‌గా విరాట్ కోహ్లి గుర్తింపు పొందాడు. గతంలో సచిన్ టెండూల్కర్ (2003లో), యువరాజ్ సింగ్ (2011లో) ఈ ఘనత సాధించారు.
చదవండి: అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది! వారిద్దరికి క్రెడిట్: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment