Mohammed Shami Confronts A Pakistani Fans After Lost The Trophy In 2017 - Sakshi
Sakshi News home page

Viral Video: పాక్‌ అభిమానికి షమీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌..!

Published Tue, Oct 26 2021 3:41 PM | Last Updated on Tue, Oct 26 2021 4:31 PM

Mohammed Shami Confronts A Pakistani Fans After Champions Trophy Loss In 2017 - Sakshi

Mohammad Shami Confronts Pakistani Fan After Champions Trophy Defeat Vs Pak: టీ20 ప్రపంచకప్-2021‎లో టీమిండియా పాక్‌ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న అనంతరం భారత పేసర్‌ మహ్మద్‌ షమీని టార్గెట్‌ చేస్తూ కొందరు దురభిమానులు సోషల్‌మీడియా వేదికగా మాటల దాడికి దిగిన సంగతి తెలిసిందే. పాక్‌ చేతిలో ఓటమికి షమీనే కారణమని, అతడు పాక్‌కు అమ్ముడుపోయాడని, షమీని పాక్‌కు తరిమికొట్టాలంటూ భారీ ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు. అయితే షమీకి ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకులు, టీమిండియా అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో షమీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్‌ చేస్తుంది. ఇందులో షమీ పాక్ అభిమానికి వార్నింగ్ ఇస్తూ కనిపిస్తాడు.

వివరాల్లోకి వెళితే.. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో టీమిండియా ఓటమి అనంతరం భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్తున్న సందర్భంగా ఓ పాక్‌ అభిమాని గ్యాలరీలో నుంచి టీమిండియా ఆటగాళ్లందరినీ ఉద్దేశించి పరుష పదజాలంతో దూషణ​కు దిగాడు. ఈ దూషణ పర్వాన్ని భారత ఆటగాళ్లంతా గమనించిప్పటికీ.. మౌనంగా డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లిపోయారు. అయితే ఆ మాటలు విన్న షమీ మాత్రం స్పందించాడు.

సదరు పాక్ అభిమానిపైకి దూసుకెళ్లి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే కెప్టెన్ ధోని షమీని సముదాయించి లోపలికి తీసుకెళ్లాడు. ఈ వీడియోను ఓ అభిమాని సోషల్‌మీడియాలో పోస్టు చేస్తూ దేశం పట్ల షమీకి ఉన్న అంకితభావం ఇదంటూ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియా వైరలవుతుంది. దీంతో షమీకి భారీ ఎత్తున నెటిజన్ల మద్దతు లభిస్తుంది. గతంలో షమీ టీమిండియా తరఫున సాధించిన ఘనతలను షేర్‌ చేస్తూ అండగా నిలుస్తున్నారు. 
చదవండి: IND Vs PAK: షమీపై నెటిజన్ల దాడి.. ఖండించిన టీమిండియా మాజీలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement