
PC: IPL/BCCI
IPL 2022 Trending Videos: ఈద్ సందర్భంగా చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంఛైజీ తమ ఆటగాళ్ల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సహా మొయిన్ అలీ, రాబిన్ ఊతప్ప, డ్వేన్ బ్రావో, అంబటి రాయుడు తదితర క్రికెటర్లు తమ కుటుంబాలతో కలిసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై షేర్ చేసింది.
EIDhu Namma Kondattam! 💛
— Chennai Super Kings (@ChennaiIPL) May 3, 2022
Celebrating the festivities the SuperKings way🦁#Yellove #WhistlePodu 🦁 pic.twitter.com/HecryvhKVn
ఇక దీనితో పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఇతర ఐపీఎల్ జట్ల మరికొన్ని ఫొటోలు, వీడియోలు మీకోసం..
సహచర ఆటగాళ్లతో కలిసి రంజాన్ సెలబ్రేట్ చేసుకున్న షమీ
గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ షమీ సహచర క్రికెటర్లతో కలిసి రంజాన్ పండుగ జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్‌తో కలిసి ఫొటోలు దిగాడు.
Eid Mubarak #Eid_Mubarak #mshami11 @rashidkhan_19 @RGurbaz_21 pic.twitter.com/ziFWauCyip
— Mohammad Shami (@MdShami11) May 3, 2022
జిమ్‌లో చెమటోడుస్తున్న ఆర్సీబీ ఆటగాళ్లు
కోచ్ శంకర్ బసు మార్గదర్శనంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు జిమ్‌లో కఠిన వర్కౌట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్క ఆటగాడికి తన అవసరాలకు తగ్గట్టుగా ఫిట్‌నెస్ సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు బసు పేర్కొన్నాడు.
సహచర ఆటగాళ్లను ఓడించిన రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ క్రికెటర్ల ఆట విడుపు వీడియోను ఫ్రాంఛైజీ షేర్ చేసింది. బ్రెవిస్, బాసిల్ థంపి, ఆర్యన్ తదితరులతో కలిసి గేమ్ ఆడిన రోహిత్ వాళ్లందరినీ ఎలిమినేట్ చేసి తాను విజేతగా నిలిచాడు.
గుజరాత్‌తో పోరు సిద్ధమవుతున్న పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ 2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌కు పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. నెట్స్‌లో తీవ్రంగా చెమటోడుస్తున్నారు.
Lines drawn, game 🔛 ⚔️#SaddaPunjab #PunjabKings #IPL2022 #ਸਾਡਾਪੰਜਾਬ #GTvPBKS pic.twitter.com/e6NhX0rFqw
— Punjab Kings (@PunjabKingsIPL) May 3, 2022
వైరల్ అవుతున్న తిలక్ వర్మ ప్రాంక్ వీడియో
సహచర ఆటగాళ్లు డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, రిలే మెరిడిత్‌లను ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ సరదాగా ఆటపట్టించాడు. పేస్ట్ బిస్కట్లు తినిపించి వారిని బోల్తా కొట్టించాడు.
చదవండి👉🏾Rinku Singh: తొమ్మిదో క్లాస్‌లో చదువు బంద్.. స్వీపర్, ఆటోడ్రైవర్.. ఆ 80 లక్షలు!
Comments
Please login to add a commentAdd a comment