
పేసర్ షమీకి పితృ వియోగం
భారత క్రికెట్ జట్టు పేసర్ మొహమ్మద్ షమీకి పితృ వియోగం కలిగింది.
కాన్పూర్: భారత క్రికెట్ జట్టు పేసర్ మొహమ్మద్ షమీకి పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి తౌసీఫ్ అలీ గురువారం గుండెపోటుతో మరణించారు. దీంతో ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటూ భారత టి20 జట్టుతో పాటే కాన్పూర్‌లో ఉన్న షమీ హుటాహుటిన స్వస్థలం అమ్రోహాకు వెళ్లాడు. ఈనెల 5నే షమీ తండ్రికి తొలిసారి గుండెపోటు రాగా అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.