
కోల్‌కతా: భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ తన జీవనాధారం కోసం రూ. 10 లక్షల భరణం ఇప్పించాలని అలీపూర్ కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఆమె పెట్టిన గృహహింస కేసును విచారిస్తున్న ఈ కోర్టు... షమీతో పాటు అతని కుటుంబసభ్యులంతా 15 రోజుల్లోగా కోర్టులో స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. హసీన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ‘హసీన్ జహాన్‌కు షమీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేసులు వేసిన తర్వాత రూ. లక్ష చెక్ ఇచ్చినా అది బౌన్స్ అయింది. దీంతో ఆమె వద్ద ఇప్పుడు చిల్లి గవ్వ లేదు’ అని అన్నారు. హసీన్ తన ఇంటి ఖర్చులు, వ్యక్తిగత అవసరాల కోసం రూ. 7 లక్షలు, కుమార్తె ఐరా ఖర్చుల కోసం మరో రూ. 3 లక్షలు భరణంగా ఇప్పించాలని కోర్టును ఆశ్రయించిందని లాయర్ చెప్పారు.