![Indian Team Pace Bowler Mohammed Shami tests positive for Covid-19 - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/18/SHAMI-JADEJA-59599.jpg.webp?itok=hbxXGyJy)
భారత జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ కరోనా వైరస్ బారిన పడ్డాడు. దాంతో ఈనెల 20 నుంచి ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు షమీ దూరమయ్యాడు. షమీ స్థానంలో మరో పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌ను భారత జట్టులో ఎంపిక చేశారు.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈనెల 20న మొహాలీలో జరిగే తొలి మ్యాచ్‌తో సిరీస్ మొదలవుతుంది. ఇప్పటికే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్ జట్టులోని ఇతర ఆటగాళ్లు శనివారం సాయంత్రం చండీగఢ్‌కు చేరుకున్నారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టి20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో షమీకి చోటు లభించలేదు. ఈ మెగా ఈవెంట్‌కు షమీని స్టాండ్‌బైగా ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment