
కోల్‌కతా: పేసర్ మొహమ్మద్ షమీ ఫిబ్రవరి 17, 18 తేదీల్లో దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం స్పష్టం చేసింది. కోల్‌కతా పోలీసులు అడిగిన వివరాల మేరకు బీసీసీఐ ఈ విషయాన్ని నిర్ధారించింది. షమీ భార్య హసీన్ జహాన్ ఆరోపణల నేపథ్యంలో ఈ అంశంపై దృష్టి సారించిన కోల్‌కతా పోలీసులు గత నెలలో షమీ ఎక్కడెక్కడికి వెళ్లాడనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
ఈ నేపథ్యంలో షమీ గత నెల షెడ్యూల్ వివరాలను కోరారు. మరోవైపు ఈ మొత్తం అంశంలో మూడో వ్యక్తి హస్తం ఉందని షమీ ఆరోపించాడు. ‘ఇది హసీన్ పని కాదు. డబ్బు కోసం ఆడుతున్న నాటకం అయి ఉండొచ్చు’ అని అన్నాడు.