
'విరాట్ కోహ్లి ఫార్ములా సరైనదే'
ఇటీవల కాలంలో ఐదుగురు స్పెషలిస్టు బౌలర్ల ఫార్ములాను అనుసరిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి పేసర్ మొహ్మద్ షమీకి మద్దతు పలికాడు.
సెయింట్ లూసియా:ఇటీవల కాలంలో ఐదుగురు స్పెషలిస్టు బౌలర్ల ఫార్ములాను అనుసరిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి పేసర్ మొహ్మద్ షమీకి మద్దతు పలికాడు. గత టెస్టు మ్యాచ్లో స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగినా వెస్టిండీస్పై విజయం సాధించలేకపోవడంపై పలు విమర్శలు తలెత్తని నేపథ్యంలో షమీ స్పందించాడు. విరాట్ కోహ్లి అవలంభించే స్పెషలిస్టు బౌలర్ల థియరీలో ఎటువంటి తప్పిదం లేదన్నాడు. ఇలా చేయడం వల్ల బౌలర్ల ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నాడు. దాంతో జట్టు బౌలింగ్ విభాగం కూడా మరింత బలపడుతుందన్నాడు.
'ఐదుగురు స్పెషలిస్టులో విరాట్ ఫార్ములా సరైనదే. ఒక ఫాస్ట్ బౌలర్ ఎక్కువ సమయం బౌలింగ్ చేసే సమయంలో విశ్రాంతి కూడా అవసరం. ఆ క్రమంలో స్పెషలిస్టు బౌలర్ల థియరీ ఉపయెగపడుతుంది. ఈ విధానంలో బౌలర్లపై అదనపు భారం కూడా తగ్గే అవకాశం ఉంది' అని షమీ తెలిపాడు. చాలా కాలం అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న తాను తిరిగి గాడిలో పడటం నిజంగా సంతోషకరమన్నాడు. అయితే పూర్తి ఫిట్నెస్తో జట్టులోకి వచ్చిన తరువాత మళ్లీ గాయాల బారిన పడుకూడదని అనుకుంటున్నట్లు షమీ పేర్కొన్నాడు. మంగళవారం నుంచి ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో గ్రాస్ ఐస్లెట్లోని డారెన్ స్యామీ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తుంది.