మహ్మద్ షమీ, హసినా జహాన్
కోల్‌కతా: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్య హసినా జహాన్ మరోసారి బాంబు పేల్చారు. తన భర్తతో వైవాహిక బంధాన్ని తెంచుకోబోనని, అతడిని కోర్టు మెట్లు ఎక్కిస్తానని అన్నారు. అతడిని మార్చేందుకు చాలా ప్రయత్నించానని ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు. తనను చిత్రహింసలకు గురిచేశాడని, భార్యగా ఏనాడు చూడలేదని వాపోయారు. అతడో శృంగార పురుషుడని ఘాటుగా వ్యాఖ్యానించారు.
తన చివరిశ్వాస వరకు భర్తతో కలిసేవుంటానని, అతడికి విడాకులు ఇవ్వబోనని స్పష్టం చేశారు. తన భర్త చేసిన అకృత్యాలకు సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయని, వీటితో అతడిని కోర్టుకు లాగుతానని ప్రకటించారు. కాగా, చాలా మంది యువతులతో షమీకి వివాహేతర సంబంధాలున్నాయని అంతకుముందు జహాన్ ఆరోపించారు. తన భార్య చేసిన ఆరోపణలను షమీ తోసిపుచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment