దుబాయ్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా భారత్ క్రికెటర్లకు మంచి ప్రాక్టీస్ లభించనుందని టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తెలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడనున్నాడు. రెండు నెలల తర్వాత ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా టూర్‌కు ఐపీఎల్ ఎంతో లాభించనుందని తెలిపాడు. ఆసీస్‌తో టీ 20 సిరీస్, 4టెస్ట్ మ్యాచ్‌లు, వన్డే మ్యాచ్‌లను టీమిండియా ఆడనుంది. అయితే ఐపీఎల్‌లో ఆసీస్ ఆటగాళ్లు పాల్గొంటున్నందున తమకెంతో ఉపయోగపడనుందని షమీ తెలిపాడు. కాగా ఆసీస్ జట్టును ఎదుర్కొవడానికి నిరంతరం టీమ్ ఆటగాళ్లు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నాడు.
అయితే ఐపీఎల్ తరువాత ఆసీస్ టూర్‌కు సమయం ఎక్కువ లేదనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తు ఐపీఎల్ తక్కువ ఓవర్ల లీగ్ కాబట్టి ఆటగాళ్లపై ఒత్తిడి ఉండదని అభిప్రాయపడ్డాడు. కాగా పేస్, సీమ్, రిథమ్‌లు కలగలిపిన షమీ తన బౌలింగ్‌ను పదునుపెట్టే పనిలో పడ్డాడు. లాక్‌డౌన్ సమయంలోను ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలంలో ఉన్న ఫామ్ హౌజ్‌లో షమీ ప్రాక్టీస్ చేశాడు. (చదవండి: సరిగ్గా ఏడాది క్రితం.. వరల్డ్‌కప్‌లో)
Comments
Please login to add a commentAdd a comment