జహాన్‌.. ఐ మిస్‌ యూ: షమీ | Mohammad Shami Marriage anniversary Wishes To His Wife   | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 10 2018 2:28 PM | Last Updated on Tue, Apr 10 2018 2:29 PM

Mohammad Shami Marriage anniversary Wishes To His Wife   - Sakshi

మహ్మద్‌ షమీ, హసీన్‌ జహాన్‌ (ఫైల్‌ ఫొటో)

మొహాలీ : టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈ సారి ఏ ఆరోపణలో లేకుంటే కేసుల విషయంలో కాదు. భార్యపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ తన మంచి మనసును చాటుకున్నాడు.తన వివాహమై నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అతని భార్య హసీన్‌ జహాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్‌ చేశాడు. అయితే ఆ సమయాన జహాన్‌ తన దగ్గర లేనందుకు బాధపడుతూ.. ఆవేదన చేందాడు. ‘నాలుగో పెళ్లి రోజు సందర్భంగా నా భార్యకు ఈ కేకు.. మిస్‌ యూ జహన్‌’ అనే క్యాప్షన్‌తో కేకు ఫొటోను షేర్‌ చేశాడు.

అయితే ఈ పోస్ట్‌పై షమీ అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నీ నాశనం కోరుకున్న ఆమెను ఇంకా ఎలా కోరకుంటావ్‌ భాయ్‌ అంటూ కొందరు షమీని ప్రశ్నిస్తున్నారు. ఇంత మంచి మనసున్న వ్యక్తిని బాధపెట్టాలని ఎలా అనిపించింది వదినా అని జహాన్‌ ఉద్దేశించి కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇక షమీ ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని, తనని మానసికంగా వేధించాడని, ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని అతనిపై జహాన్‌ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గృహ హింస కింద కోల్‌కతా పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగని జహాన్‌ షమీని ఐపీఎల్‌లో ఆడనివ్వద్దని బీసీసీఐ అధికారులకు కూడా విజ్ఞప్తి చేశారు.  

4th Marriage anniversary cake for my bebo miss you 🎂💋💋

A post shared by Mohammad Shami (@mdshami.11) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement