Rohit Sharma: టీమిండియా అభిమానులకు శుభవార్త. ఇటీవల కోవిడ్ బారిన పడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ కోలుకున్నాడని తెలుస్తోంది. కోవిడ్ నిర్ధారణ అయ్యే సమయానికి స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న రోహిత్.. తాజాగా పూర్తిగా కోలుకున్నాడని సమాచారం. ఇవాళ (జూన్ 28) సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటో ఈ వార్తకు బలం చేకూరుస్తుంది.
A thumbs up from Rohit Sharma in his latest Instagram story. pic.twitter.com/ZAILwMR0gj
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 27, 2022
రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్వయంగా షేర్ చేసిన ఈ ఫోటో చూసి టీమిండియా అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. రోహిత్ ఈ ఫోటోలో థమ్స్ అప్ చెబుతూ నవ్వుతూ కనిపించడంతో అతడు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడని, ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ సమయానికి తప్పక అందుబాటులో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారంపై బీసీసీఐ లేదా రోహిత్ శర్మ స్పందించాల్సి ఉంది.
This makes me feel like he's going to play the test match. @ImRo45 🔥 pic.twitter.com/Jsk5LdR680
— ANSHUMAN🚩 (@AvengerReturns) June 27, 2022
ఇదిలా ఉంటే, జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో రీ షెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజుల ముందు వార్మప్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడటంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. మ్యాచ్ సమయానికి రోహిత్ అందుబాటులో ఉంటాడో లేదో అన్న సందేహాలు వ్యక్తం చేశారు. బ్యాకప్ ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్‌ను కూడా ఇంగ్లండ్‌కు రప్పించారు. కొత్త కెప్టెన్ ఎవరన్న చర్చ కూడా క్రికెట్ వార్గల్లో జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో రోహిత్ కోలుకున్నాడన్న వార్త టీమిండియాకు మనోధైర్యాన్ని ఇస్తుంది.
చదవండి: నాన్న రెస్ట్ తీసుకుంటున్నాడు.. ఇంకా నెల రోజులు: రోహిత్ శర్మ కుమార్తె
Comments
Please login to add a commentAdd a comment