India vs Bangladesh, 1st Test Chennai Day 4 Updates:
భారత్ ఘన విజయం
చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై 280 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం సాధించింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు 233 పరుగులకు ఆలౌటైంది. 158/4 వ ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజును ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ అశ్విన్ స్పిన్ ఉచ్చులో చిక్కు కుంది.
అశ్విన్ 6 వికెట్లతో చెలరేగాడు. అశ్విన్‌తో పాటు జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ శాంటో(82) మినహా మిగితా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.
విజయానికి చేరువలో భారత్..
తొలి టెస్టులో విజయానికి భారత్ కేవలం రెండు వికెట్ల దూరంలో నిలిచింది. వరుస క్రమంలో బంగ్లాదేశ్ వికెట్లు కోల్పోయింది. మెహదీ హసన్ మిరాజ్ ఏడో వికెట్‌గా వెనుదిరగా.. కెప్టెన్ షాంటో(82) ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. రవిచంద్రన్ అశ్విన్ మరో ఐదు వికెట్ల ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆరో వికెట్ డౌన్..
చెపాక్ టెస్టులో బంగ్లాదేశ్ ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. లిట్టన్ దాస్ రూపంలో బంగ్లా ఆరో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన దాస్.. జడేజా బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత్ విజయానికి ఇంకా 4 వికెట్ల దూరంలో నిలిచింది.
ఐదో వికెట్ డౌన్..
194 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన షకీల్ అల్ హసన్.. అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అశ్విన్ నాలుగో రోజు ఆటలో తన వేసిన తొలి ఓవర్‌లో భారత్‌కు వికెట్‌ను అందించాడు. క్రీజులోకి లిట్టన్ దాస్ వచ్చాడు. 54 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
నిలకడగా ఆడుతున్న బంగ్లా..
నాలుగో రోజు ఆటలో బంగ్లా బ్యాటర్లు షాంటో(64), షకీల్ అల్ హసన్(25) నిలకడగా ఆడుతున్నారు. 51 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. బంగ్లా విజయానికి ఇంకా 321 పరుగులు అవసరం.
చెపాక్ వేదికగా బంగ్లాదేశ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. బంగ్లాదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. క్రీజులో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ షాంటో(51), షకీబ్ అల్ హసన్(5) ఉన్నారు. బంగ్లాదేశ్ తమ విజయానికి 357 పరుగుల దూరంలో ఉంది.
టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు సెప్టెంబరు 19- 23
వేదిక: చెపాక్ స్టేడియం, చెన్నై
టాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్
టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 376
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 149
తుదిజట్లు:
టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్
షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా.
Comments
Please login to add a commentAdd a comment