
బ్రిస్బేన్: కెప్టెన్ జో రూట్ (158 బంతుల్లో 86 బ్యాటింగ్; 10 ఫోర్లు), డేవిడ్ మలాన్ (177 బంతుల్లో 80 బ్యాటింగ్; 10 ఫోర్లు) వీరోచిత ఆటతీరుతో యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ కోలుకుంది. మ్యాచ్ మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రూట్, మలాన్ మూడో వికెట్‌కు 159 పరుగులు జోడించారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు ఏకంగా 278 పరుగుల ఆధిక్యం కోల్పోయి పరాజయానికి బాటలు వేసుకున్నట్లు కనిపించిన ఇంగ్లండ్... ప్రస్తుతం మరో 58 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. చేతిలో 8 వికెట్లతో చెప్పుకోదగ్గ పరుగులు సాధిస్తే చివరి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు సవాల్ విసరవచ్చు. అర్ధ సెంచరీ చేసిన క్రమంలో రూట్ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్‌గా నిలిచాడు.
మైకేల్ వాన్ (2002లో 1,481 పరుగులు) పేరిట ఉన్న రికార్డును రూట్ సవరించాడు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో రూట్ ఇప్పటికి 1,541 పరుగులు చేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 343/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 104.3 ఓవర్లలో 425 పరుగుల వద్ద ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (152; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.
Comments
Please login to add a commentAdd a comment