India Vs Nz 1st Test Day 3 2021 Highlights Updates.. న్యూజిలాండ్, టీమిండియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ మూడోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 4, పుజారా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక గిల్ ఒక పరుగు చేసి జేమిసన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఓవరాల్‌గా టీమిండియా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు టామ్ లాథమ్(95), విల్ యంగ్(89) మినహా మిగతావారు విఫలమయ్యారు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 5 వికెట్లతో మెరిశాడు.
4:15PM.. న్యూజిలాండ్‌ను 296 పరుగుల వద్ద ఆలౌట్ చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్(1) కైల్ జేమీసన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. కాగా జేమీసన్‌కు ఇది 50వ టెస్టు వికెట్ కావడం విశేషం. ప్రస్తుతం టీమిండియా 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 1, పుజారా 4 పరుగులతో ఆడుతున్నారు.
4:00PM: న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. 142.3 ఓవర్లలో 296 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను పూర్తి చేసింది. ఓపెనర్లు టామ్ లాథమ్(95), విల్ యంగ్(89) అద్భుతంగా రాణించగా.. మిగతా ఆటగాళ్లెవరూ కనీసం 25 పరుగులు కూడా చేయలేదు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టగా... అశ్విన్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఉమేశ్, జడేజా చెరో వికెట్ తీశారు.
3: 40 PM: మూడో రోజు ఆటలో భాగంగా న్యూజిలాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో కైలీ జెమీషణ్ అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విలియం సోమర్‌విల్లే, అజాజ్ పటేల్ క్రీజులో ఉన్నారు.
స్కోరు: 284/9
న్యూజిలాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కివీస్ ఆటగాడు టిమ్ సౌథీని అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. విలియం సోమర్‌విల్లే, కైలీ జెమీషన్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా బౌలర్లలో అశ్విన్‌కు ఒకటి, ఉమేశ్ యాదవ్‌కు ఒకటి, అక్షర్ పటేల్‌కు 5, జడేజాకు ఒక వికెట్ దక్కాయి. విల్ యంగ్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపడంతో వికెట్ల ఖాతా తెరిచిన టీమిండియా.. మొత్తంగా 8 వికెట్లు పడగొట్టింది.
3:32 PM: న్యూజిలాండ్ స్కోరు: 282/8 (136).
3:06 PM: ఎనిమిదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
2:56 PM:
న్యూజిలాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 258 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన బ్లండెల్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 124 ఓవర్లు ముగిసేసరికి కీవిస్ 7వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ప్రస్తుతం , కైలీ జెమీషన్, టిమ్ సౌథీ క్రీజులో ఉన్నారు.
2:50 PM: న్యూజిలాండ్ స్కోరు: 256/2 (123)
2:33 PM: భారత స్పిన్నర్ల ధాటికి న్యూజిలాండ్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోతోంది. 241 పరుగుల వద్ద కీవిస్ ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టామ్ బ్లండెల్, కైలీ జెమీషన్ క్రీజులో ఉన్నారు.
02:00 pm: 13 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర.. జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో టామ్ బ్లండల్(4) పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా కైల్ జామీసన్ క్రీజులోకి వచ్చాడు.
227 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 95 పరుగులు చేసిన లాథమ్.. అక్షర్ పటేల్ వేసిన అద్భుతమైన బంతికి లాథమ్ స్టంప్ ఔట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు సాధించగా, అశ్విన్, ఉమేశ్ యాదవ్, చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో టామ్ బ్లండల్(4), రచిన్ రవీంద్ర (5) పరుగులుతో క్రీజులో ఉన్నారు.
►అక్షర్ పటేల్ మరోసారి మాయ చేశాడు. అద్భుతమైన బంతితో కివీస్ బ్యాటర్ హెన్రీ నికోలస్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో.. న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించగా, అశ్విన్, ఉమేశ్ యాదవ్, చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
►కాన్పూర్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రాస్ టేలర్.. వికెట్ కీపర్ కేఎస్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టామ్ లాథమ్ 89 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా హెన్రీ నికోలస్ క్రీజులోకి వచ్చాడు.
మూడో రోజు ఆటలో భాగంగా న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 64 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. టామ్ లాథమ్ 89 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
11:33 AM:
న్యూజిలాండ్ స్కోరు: 197/2 (85.3).
11:15 AM:
కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఓపెనర్ టామ్ లాథమ్ నిలకడగా ఆడుతున్నారు. 82 ఓవర్లు ముగిసే సరికి కివీస్ ఒక వికెట్ కోల్పోయి 192 పరుగులు చేసింది. న్యూజిలాండ్ స్కోరు- 192/1 (82)
10:46 AM:
కేన్ విలియమ్సన్ 13 పరుగులు, ఓపెనర్ టామ్ లాథమ్ 72 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 74 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 182.
ఎట్టకేలకు టీమిండియాకు తొలి వికెట్ దక్కింది. భారత బౌలర్లకు చుక్కలు చూపించిన న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. వృద్ధిమాన్ సాహా స్థానంలో సబ్‌ట్యూట్‌గా వచ్చిన వికెట్ కీపర్ కేఎస్ భరత్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా రివ్యూకు వెళ్లగా ఫలితం అనుకూలంగా వచ్చింది. విల్ యంగ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో కివీస్ మొదటి వికెట్ కోల్పోయింది.
10:15 AM:
న్యూజిలాండ్ స్కోరు: 152/1 (67)
► భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆటను కీవిస్ ధాటిగా ఆరంభించింది. 63 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా న్యూజిలాండ్ 143 పరుగులు చేసింది. విల్ యంగ్ 85, టామ్ లాథమ్ 52 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
►భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి మెరుగైన స్థితిలో నిలిచిన న్యూజిలాండ్ మూడో రోజు ఆటమెదలు పెట్టింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. విల్ యంగ్ 75, టామ్ లాథమ్50 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
భారత జట్టు: శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(కెప్టెన్) శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్
న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కైల్ జామీసన్, విలియం సోమర్‌విల్లే.
చదవండి: IND vs NZ: క్రికెట్ ఫ్యాన్ మాత్రమే కాదు బాధ్యత ఉన్నోడు!
Comments
Please login to add a commentAdd a comment