అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టు మ్యాచ్ అంటే ఐదు రోజుల పాటు జరుగుతుందన్న సంగతి తెలిసిందే. దేశవాళీ క్రికెట్‌లో, అనాధకరిక టెస్టు మ్యాచ్‌లు నాలుగు రోజులు పాటు కూడా జరగుతాయి. కానీ గతంలో ఆరు రోజుల టెస్టు మ్యాచ్‌లు కూడా జరిగేవి ఉన్న విషయం మీకు తెలుసా?
1980లు, 90ల్లో 6 రోజుల టెస్టు మ్యాచ్ బాగా పాపులర్. ఇంగ్లండ్‌లో అనేక మ్యాచ్‌లు ఆరు రోజుల పాటు జరిగాయి. చివరగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరు రోజుల టెస్టు మ్యాచ్ 2008లో బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరిగింది. అయితే ఇదింతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? అది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
16 ఏళ్ల తర్వాత తొలిసారి..?
అంతర్జాతీయ క్రికెట్‌లో 16 ఏళ్ల తర్వాత తొలిసారి ఆరు రోజుల మ్యాచ్ జరగనుంది. ఈ అరుదైన ఘట్టానికి సెప్టెంబర్ 18 నుంచి శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య ప్రారంభం కానున్న తొలి టెస్టు వేదిక కానుంది. వచ్చె నెలలలో న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు శ్రీలంకకు రానుంది.
ఈ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ సెప్టెంబర్ 18 నుంచి 23 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆరు రోజుల పాటు జరగనుంది. దేశంలో అధ్యక్ష ఎన్నికల కారణంగా సెప్టెంబర్ 21 న మ్యాచ్ జరగడం లేదు. ఆ రోజును విశ్రాంతిగా ప్రకటించారు.
తొలి రెండు రోజుల తర్వాత ఒక్క రోజు(సెప్టెంబర్ 21 )ను రెస్ట్ డేగా ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి మళ్లీ 22, 23, 24 తేదీల్లో మ్యాచ్ కొనసాగుతుంది. అయితే రెండో టెస్టు మాత్రం యధావిధిగా 5 రోజుల పాటే జరగనుంది. కాగా ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
అప్పుడు బంగ్లాలో.. ఇప్పుడు శ్రీలంకలో
శ్రీలంక చివరగా ఆరు రోజుల టెస్టు మ్యాచ్ 2008లో ఆడింది. ఆ ఏడాది శ్రీలంక క్రికెట్ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. అయితే ఈ సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆరు రోజుల పాటు జరిగింది.
బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఆరు రోజుల పాటు టెస్టును షెడ్యూల్ చేశారు. డిసెంబర్ 26 నుంచి 31 వరకు ఆ టెస్టు మ్యాచ్ కొనసాగింది. మళ్లీ ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీలంక ఆరు రోజుల టెస్టు మ్యాచ్ ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment