Srilanka Tour Of India: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని బీసీసీఐ మరోసారి అవమానించింది. కెరీర్లో అరుదైన మైలురాయిగా నిలిచే తన 100వ టెస్ట్ మ్యాచ్‌ని, ప్రత్యేక అనుబంధం ఉన్న బెంగళూరు(ఐపీఎల్) నగరంలో కాకుండా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మొహాలిలో నిర్వహించేందుకు మొగ్గు చూపింది. షెడ్యూల్ మార్పు విషయంలో శ్రీలంక క్రికెట్ బోర్డు అభ్యర్ధనను మన్నించి, ముందుగా టీ20 సిరీస్‌కు అనుమితిచ్చిన బీసీసీఐ, కోహ్లికి చిరకాలం గుర్తుండిపోయే టెస్ట్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా యధాతథంగా కొనసాగించేందుకు రెడీ అయ్యింది.
దీంతో అటు ఆర్సీబీ అభిమానులతో పాటు విరాట్ కోహ్లి కూడా తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ కారణంగా విరాట్ కోహ్లికి బెంగళూరుతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌తో కలుపుకుని మొత్తం 15 సీజన్ల పాటు అతను నిరాటంకంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కే ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ చరిత్రలో మరే ఇతర ఆటగాడు కోహ్లిలా ఒకే జట్టుకు ఆడింది లేదు.
ఇదిలా ఉంటే, కోహ్లి వందో టెస్ట్ విషయంలో బీసీసీఐ బాస్ గంగూలీ కొద్ది రోజుల ముందే ఓ ప్రకటన చేశాడు. శ్రీలంక సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేసైనా కోహ్లి మైలురాయి టెస్ట్‌ని బెంగళూరులో నిర్వహిస్తామని, అందులోనూ అది డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్ట్‌గా ఉంటుందని ప్రకటించాడు. అయితే, బీసీసీఐ తాజాగా వేదికల మార్పు అంశాన్ని పక్కన పెట్టి.. ముందుగా టీ20 సిరీస్‌ను ఆతర్వాత టెస్ట్ సిరీస్‌ను నిర్వహించాలని డిసైడ్ చేసింది.
సవరించిన షెడ్యూల్ ప్రకారం.. భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20 ఫిబ్రవరి 24న లక్నోలో, రెండు, మూడో టీ20లు 26, 27 తేదీల్లో ధర్మశాలలో జరగనున్నాయి. అనంతరం తొలి టెస్ట్ మార్చి 3 నుంచి మొహాలీ వేదికగా, రెండో టెస్ట్ మార్చి 12 నుంచి బెంగళూరులో జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం రోహిత్ సారధ్యంలోని టీమిండియా.. వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా జరిగిన తొలి వన్డేలో రోహిత్ సేన.. విండీస్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రేపు ప్రారంభంకానుంది.
చదవండి: 4 Nation T20 Series: భారత్-పాక్ టీ20 సిరీస్‌పై జై షా కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment