లార్డ్స్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ యువ పేసర్ జోష్ టంగ్ ఓ ఆసక్తికర పరిణామం ద్వారా వార్తల్లో నిలిచాడు. టంగ్ ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఆడతాడని ఓ వ్యక్తి 14 ఏళ్ల కిందట 50000 పౌండ్ల (భారత కరెన్సీలో 50 లక్షలకు పైమాటే) పందెం కాసి గెలవడంతో ఈ వార్సెస్టర్‌షైర్ బౌలర్ క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా నిలిచాడు.
టంగ్ ఇంగ్లండ్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో జాక్‌పాట్ కొట్టిన పందెం కాసిన వ్యక్తి, ప్రస్తుతం రెట్టింపు సంతోషానికి లోనవుతున్నాడు. టంగ్ అరంగేట్రంలోనే ఐదు వికెట్ల ఘనత సాధించడం సదరు వ్యక్తి అదనపు సంతోషానికి కారణం. టంగ్ ఇంగ్లండ్ తరఫున తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు సాధించడంతో ఆ వ్యక్తి ఉబ్బితబ్బిబైపోతున్నాడు. అందులోనూ టంగ్ ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఈ ఫీట్ సాధించడంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
కాగా, ఐర్లాండ్‌తో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టంగ్ ఐదేయడంతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. స్టువర్ట్ బ్రాడ్ (5/51) ఐదేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌట్ కాగా.. ఓలీ పోప్ (208 బంతుల్లో 205; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, బెన్ డకెట్ (178 బంతుల్లో 182; 24 ఫోర్లు, సిక్స్) భారీ శతకంతో విరుచుకుపడటంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 524/4 (82.4 ఓవర్లలో) స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 362 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 11 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండానే ఛేదించి 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment