అయ్యర్‌... మరిన్ని రోజులు | Shreyas Iyer ruled out of Lancashire Royal London Cup campaign | Sakshi
Sakshi News home page

అయ్యర్‌... మరిన్ని రోజులు

Published Tue, Jul 20 2021 5:18 AM | Last Updated on Tue, Jul 20 2021 5:18 AM

Shreyas Iyer ruled out of Lancashire Royal London Cup campaign - Sakshi

మాంచెస్టర్‌: మైదానంలో భారత మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ శ్రేయస్‌ ఆయ్యర్‌ ఆటను చూసేందుకు అతడి అభిమానులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అతడి ఎడమ భుజానికి చేసిన శస్త్ర చికిత్స నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నెల 22 నుంచి ఆగస్టు 8 వరకు జరిగే ఇంగ్లండ్‌ దేశవాళి వన్డే టోర్నీ రాయల్‌ లండన్‌ కప్‌కు అయ్యర్‌ దూరమయ్యాడు. నిజానికి అతను ఈ టోర్నీలో లాంకషైర్‌ జట్టుకు ఆడాల్సి ఉంది. అయితే మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ ఇంకా సాధించకపోవడంతో అయ్యర్‌ టోర్నీలో పాల్గొనడం లేదంటూ ఆ జట్టు తన ప్రకటనలో ప్రకటించింది. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement