PC: IPL.com
ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ తొలి మ్యాచ్ ఆడాడు. అయితే ఆడిన తొలి మ్యాచ్‌లోనే లివింగ్‌స్టోన్ నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా గురువారం రాయల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు.
ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన ఓ అద్భుత బంతికి వికెట్ల ముందు లివింగ్‌స్టోన్ దొరికిపోయాడు. అదే విధంగా బౌలింగ్ విషయానికి వస్తే.. కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేసిన లివింగ్‌స్టోన్ వికెట్ ఏమీ తీయకుండా 9 పరుగులిచ్చాడు. ఈ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ జట్టుతో చేరి దాదాపు 10 రోజులు అవుతున్న అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో పంజాబ్ మేనెజ్‌మెంట్ పక్కన పెట్టింది.
ఎట్టకేలకు ఫిట్‌నెస్ సాధించడంతో అద్భుత ఫామ్‌లో ఉన్న సికిందర్ రజాను పక్కన పెట్టి మరి లివింగ్‌స్టోన్‌కు పంజాబ్ మేనెజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది. పంజాబ్ మేనెజ్‌మెంట్ నమ్మకాన్ని లివింగ్‌స్టోన్ నిలబెట్టుకో లేకపోయాడు. ఇక పంజాబ్ చివరి మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన సికిందర్ రజా స్ధానంలో లివింగ్‌స్టోన్‌ను తీసుకురావడాన్ని పలువురు మాజీ క్రికెటర్‌లు తప్పుబడుతున్నారు.
రజా లాంటి అద్భుత ఆల్‌రౌండర్ జట్టులో ఉండి ఉంటే.. ఆర్సీబీపై పంజాబ్ కచ్చితంగా విజయం సాధించి ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో 24 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైంది. కాగా ఈ మ్యాచ్‌కు కూడా పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా దూరమయ్యాడు.
చదవండి: IPL 2023: తిన్నగా ఆడటమే రాదు.. ఇంకా ప్రయోగాలు ఒకటి! చెత్త బ్యాటింగ్
ఎట్టకేలకు ఢిల్లీకి దక్కిన విజయం.. ఆరో మ్యాచ్‌లో అతికష్టమ్మీద
Comments
Please login to add a commentAdd a comment