లండన్: ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే లియామ్ లివింగ్‌స్టోన్ సిక్సర్ల హోరుతో బర్మింగ్‌హమ్ ఫోనిక్స్ ఫైనల్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ 10 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లివింగ్‌స్టన్ కొట్టిన ఒక భారీ సిక్స్‌ను మ్యాచ్‌ను చూడడానికి వచ్చిన ప్రేక్షకుడు అద్బుత క్యాచ్‌గా అందుకున్నాడు. బంతి స్టాండ్స్‌లోకి రావడంతో ఆ వ్యక్తి లేచి దానిని అందుకునే ప్రయత్నంలో సీటు నుంచి పక్కకు పడిపోయాడు. అయినా పట్టువిడవకుండా డైవ్ చేస్తూ సూపర్‌గా అందుకున్నాడు. ఇంకేముంది ప్రపంచాన్ని జయించానన్నట్లుగా అతను ఇచ్చిన హావభావాలు సూపర్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్ జట్టుకు ఓపెనర్లు క్రిస్ లిన్(25 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ కోహ్లర్(44 బంతుల్లో 71; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) శుభారంభాన్ని అందించారు. వీరు మినహా జట్టు సభ్యులంతా విఫలం కావడంతో సూపర్ ఛార్జర్స్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.
అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఫీనిక్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ విల్ స్మీడ్ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. అయితే అప్పుడే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ లివింగ్‌స్టోన్ వచ్చీ రాగానే బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి న్యూజిలాండ్ యువ ఓపెనర్ ఫిన్ అలెన్(26 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి 51 బంతుల్లో 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఫీనిక్స్ జట్టు కేవలం 74 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
Great night of entertainment again in #TheHundred
— Tom Hyland (@TomHyland4) August 17, 2021
Only thing better than all of Liam Livingstone’s sixes have been the crowd catches at Headingley. Catch of the night here 👇🏻 pic.twitter.com/6oTte47nxp
Comments
Please login to add a commentAdd a comment