Photo Courtesy: IPL
Liam Livingstone Hits Biggest Six Of IPL 2022: ఆదివారం (ఏప్రిల్ 3) చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ (32 బంతుల్లో 60; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ బాదిన ఐదు సిక్సర్లలో ఓ సిక్సర్ సీజన్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. చెన్నై బౌలర్ ముఖేశ్ చౌదరీ వేసిన 5వ ఓవర్ తొలి బంతికి లివింగ్ స్టోన్ బాదిన 108 మీటర్ల భారీ సిక్సర్.. ప్రస్తుత సీజన్‌లో అతి భారీ సిక్సర్‌గా రికార్డైంది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ 104 మీటర్ల సిక్స్ కొట్టగా.. ఆ రికార్డును లివింగ్‌స్టోన్ బ్రేక్ చేశాడు. కాగా, ముఖేశ్ చౌదరీ వేసిన 5వ ఓవర్‌లో లివింగ్‌స్టోన్ రెండు సిక్సర్లు, మూడు బౌండరీలు బాది ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు.
ఇదిలా ఉంటే, సీఎస్‌కేతో మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ (32 బంతుల్లో 60; 5 ఫోర్లు, 5 సిక్సర్లు; 2 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ లివింగ్‌స్టోన్ మెరుపుల సాయంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం లివింగ్‌స్టోన్ బంతితోనూ రాణించి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాహుల్ చాహర్ (3/25), వైభవ్ అరోరా (2/21), రబాడ (1/28), అర్షదీప్ సింగ్ (1/13), ఓడియన్ స్మిత్ (1/14) బంతితో తమ పాత్రను న్యాయం చేశారు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో శివమ్ దూబే (30 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒక్కడే అర్ధ శతకంతో రాణించాడు.
చదవండి: చెన్నైపై ఆల్‌రౌండ్ పంజా
Comments
Please login to add a commentAdd a comment