34 ఫోర్లు, 27 సిక్సర్లతో 350 | english-batsman-hits-world-record | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 20 2015 9:15 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

ఆ ఇన్నింగ్స్ను చూసుంటే గనుక గేల్ గాలిలా తేలిపోయేవాడు.. డివిలియర్స్ డంగైపోయేవాడు! వన్డే క్రికెట్ చరిత్రలో 350 వ్యక్తిగత పరుగులు సాధించి రికార్డు సృష్టించిన ఇంగ్లీష్ బ్యాట్స్మన్ లియామ్ లివింగ్స్టన్ ఆటను చూస్తే వారేకాదు మనమూ అచ్చెరువొందాల్సిందే! కేవలం 138 బంతుల్లో 34 ఫోర్లు, 27 సిక్సర్లతో 350 పరుగులు చేసిన లియామ్.. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) నిర్వహించిన నేషనల్ క్లబ్ చాంపియన్షిప్లో భాగంగా నార్త్ వెస్ట్ సైడ్ కాల్డీ జట్టుతో ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. దీంతో క్లబ్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు ఈ రికార్డు మన దేశానికే చెందిన నిఖిలేశ్ సురేంద్రన్ (334 పరుగులు) పేరిట ఉండేది. లియామ్ వీరబాదుడుతో నాన్ట్విచ్ జట్టు 45 ఓవర్లలో 579 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన క్లాడీ జట్టును 79 పరుగులకే ఆలౌట్ చేసి.. 500 పరుగుల రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement