![Liam Livingstone Shines As World Champions England Beat New Zealand In 2nd ODI - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/11/laim.jpg.webp?itok=TPIDjnnH)
సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 79 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. 9 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను లైమ్ లివింగ్ స్టోన్(95 నాటౌట్), సామ్ కుర్రాన్(42) పరుగులతో అదుకున్నారు.
న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లతో పడగొట్టగా.. సౌథీ రెండు, హెన్రీ, శాంట్నర్ తలా వికెట్ సాధించారు. అనంతరం 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 147 పరుగులకే కుప్పకూలింది.
న్యూజిలాండ్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(57) మినహా మిగితా పెద్దగా ఎవరూ రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ, టోప్లీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ రెండు, అటిక్కిన్ సన్ ఒక్క వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే సెప్టెంబర్ 13న లండన్ వేదికగా జరగనుంది.
చదవండి: వాన వచ్చింది... ఆట ఆగింది
Comments
Please login to add a commentAdd a comment