England vs New Zealand: A chaotic Fourth day leaves New Zealand 238 ahead as England - Sakshi
Sakshi News home page

ENG vs NZ: 238 పరుగుల ఆధిక్యంలో న్యూజిలాండ్‌

Published Tue, Jun 14 2022 8:17 AM | Last Updated on Tue, Jun 14 2022 8:42 AM

Chaotic fourth day leaves New Zealand 238 ahead as England - Sakshi

ఇంగ్లండ్‌తో నాటింగ్‌హమ్‌లో జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 238 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 473/5తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ 539 పరుగులకు ఆలౌటైంది.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్(145)‌, జో రూట్‌(176) సెంచరీలతో చెలరేగారు. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ (5/106), బ్రేస్‌వెల్‌ (3/62) రాణించారు. 14 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ ఆట ముగిసేసరికి 7 వికెట్లకు 224 పరుగులు చేసింది. క్రీజులో డార్లీ మిచెల్‌(32),హెన్రీ(8) పరుగులతో ఉన్నారు.
చదవండి: ENG vs NZ: టెస్టు క్రికెట్‌లో ఆండర్సన్ అరుదైన ఫీట్‌.. మూడో బౌలర్‌గా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement