Tim David Set To Play For MI Cape Town as Liam Livingstone Replacement - Sakshi
Sakshi News home page

SA20 2023: ముంబై జట్టుకు స్టార్‌ ఆటగాడు దూరం.. విధ్వంసకర ఆల్‌రౌండర్‌ ఎం‍ట్రీ!

Published Tue, Jan 31 2023 12:29 PM | Last Updated on Tue, Jan 31 2023 1:51 PM

Tim David set to play for MI Cape Town as Liam Livingstones replacement - Sakshi

ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ గాయం కారణంగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌ తొలి సీజన్‌కు దూరమైన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన వేలంలో లివింగ్‌స్టోన్‌ను ఏంఐ కేప్‌టౌన్‌ కొనుగోలు చేసింది. అయితే గతేడాది ఆఖరిలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో లివింగ్‌స్టోన్‌ చేతివేలికి గాయమైంది. దీంతో అతడు టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.

ఈ నేపథ్యంలో లివింగ్‌స్టోన్‌ స్థానాన్ని ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్‌ టిమ్‌ డేవిడ్‌తో ఏంఐ కేప్‌టౌన్‌ భర్తీ చేసింది. ఈ మెరకు సోషల్‌ మీడియా వేదికగా ఏంఐ కేప్‌టౌన్‌ ఓ వీడియోను షేర్‌ చేసింది. "టిమ్‌ డేవిడ్‌ ఇప్పుడు ఏంఐ కేప్‌టౌన్‌ ఫ్యామిలీలో చేరాడు అంటూ" క్యాప్షన్‌ ఇచ్చింది. కాగా డేవిడ్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

బిగ్‌బాష్‌ లీగ్‌-(2022-23)లో హోబార్ట్‌  హారికేన్స్‌ తరపున డేవిడ్‌ అదరగొట్టాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు డేవిడ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది జరిగిన ఐపీఎల్‌ మెగా వేలంలో రూ. 8.25 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది. అయితే గతేడాది సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్‌ 186 పరుగులు సాధించాడు.
చదవండి: Murali Vijay: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మురళీ విజయ్‌.. ఇప్పటికీ ఆ రికార్డు తన పేరిటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement