
Liam Livingstone Hit 88 Meters Big Six.. మ్యాచ్ స్వరూపాన్ని క్షణాల్లో మార్చేయ గల సత్తా ఉన్న ఆటగాడు లయామ్ లివింగ్‌స్టోన్. ఈ ఇంగ్లండ్ క్రికెటర్ భారీ సిక్సర్లకు పెట్టింది పేరు. బంతిని కసితీరా బాదే లివింగ్‌స్టోన్ సిక్స్ కొట్టాడంటే స్టేడియం అవతల పడాల్సిందే. ఇప్పటికే ఇలాంటి సిక్సర్లు చాలానే చూశాం. తాజాగా టీమిండియాతో మూడో వన్డేలో లివింగ్‌స్టోన్ భారీ సిక్సర్లు బాదాడు. ఇన్నింగ్స్ 34వ ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్ కొట్టిన ఒక సిక్సర్ గ్రౌండ్‌కున్న ఫెన్నింగ్ ప్లేట్‌కు తగలడంతో పెద్ద బొక్క పడింది.
ఆ తర్వాత ఇన్నింగ్స్ 36 ఓవర్లో మరోసారి హార్దిక్ బౌలింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతినే లివింగ్‌స్టోన్ డీప్ స్వ్కేర్‌లెగ్ మీదుగా భారీ సిక్సర్ సంధించాడు. 88 మీటర్ల ఎత్తులో వెళ్లిన ఆ బంతి నేరుగా స్టేడియం బయట ఉన్న కన్‌స్ట్రక‌్షన్ సైట్‌లో పడింది. అక్కడ పనిచేస్తున్న కార్మికులు బంతిని గ్రౌండ్‌లోకి విసిరేయడం విశేషం. ఇది గమనించిన హార్దిక్ లివింగ్‌స్టోన్‌వైపు చూస్తూ.. ''ఎంత పెద్ద సిక్స్'' అన్నట్లుగా నవ్వుతూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Hasan Ali: అంతుపట్టని డ్యాన్స్‌తో అదరగొట్టిన పాక్ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment