construction field
-
భవనాల ఎత్తుకు క్యాప్ పెట్టండి!
‘ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) పరిమితులు ఉన్నాయి. కానీ, ఔటర్ రింగ్ రోడ్డు వరకూ స్థలాల లభ్యత ఉన్న హైదరాబాద్‌లో మాత్రం ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు లేవు. దీంతో రోడ్డు, స్థలం విస్తీర్ణంతో సంబంధం లేకుండా బిల్డర్లు ఇష్టారాజ్యంగా హైరైజ్ భవనాలను నిర్మిస్తున్నారు. దీంతో భూములు, అపార్ట్మెంట్ల ధరలు పెరుగుతున్నాయి. ఒకే ప్రాంతంలో భవన నిర్మాణాలు ఉండటంతో రోడ్లపై వాహనాల రద్దీ, కాలుష్యం పెరగడంతో పాటు విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలపై అదనపు భారం పడుతుంది’ అని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్(నరెడ్కో) వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఛైర్మన్ ఎం.ప్రేమ్‌కుమార్ అన్నారు. ‘సాక్షి రియల్టీ’తో ఆయన ఇంటర్వ్యూ పూర్తి వివరాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోమౌలిక వసతులు, డిమాండ్ ఉన్న ప్రాంతంలో తక్కువ స్థలం దొరికినా చాలు బిల్డర్లు హైరైజ్ భవనాలు కట్టేస్తున్నారు. దీంతో స్థలాలు, అపార్ట్మెంట్ల ధరలు పెరగడం తప్ప సమాంతర అభివృద్ధి జరగడం లేదు. నగరాభివృద్ధికి ఆకాశహర్మ్యలే ప్రతీక. ఆర్థికంగా, సాంకేతికంగా మనం ఎంత శక్తిమంతులమో ఇవి నిరూపిస్తాయి. అలా అని రోడ్డు, మౌలిక సదుపాయాలపై పడే ప్రభావాన్ని అంచనా వేయకుండా అనుమతులు ఇవ్వకూడదు. ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు ఉంటేనే బిల్డర్లు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా ఓఆర్ఆర్ చుట్టూ ఖాళీగా ఉన్న ప్రాంతాల వైపు దృష్టిసారిస్తారు. దీంతో ధరలు తగ్గి, సామాన్యుల సొంతింటి కల సాకారం అవుతుంది. నార్సింగి, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో కనీసం నివాస భవనాలకైనా ఎఫ్ఎప్ఐపై క్యాప్ పెట్టాలి.మూసీ పరిహారంగా స్థలాలు..గ్లోబల్ సిటీగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న హైదరాబాద్‌లో కంపుకొట్టే మూసీ నది ఉండటం శోచనీయం. విదేశీ పర్యాటకులు, పెట్టుబడులను ఆకర్షించాలంటే మూసీ సుందరీకరణ అనివార్యం. ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభినందనీయం. అయితే మూసీ పరివాహక ప్రాంతంలోని నివాసితులను ఒప్పించి ఆయా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. మూసీ బాధితులకు శివారు ప్రాంతంలో ప్రభుత్వమే లేఔట్ చేసి, 60–80 గజాల చొప్పున స్థలాన్ని కేటాయించాలి. దీంతో వాళ్లే సొంతంగా ఇళ్లు కట్టుకుంటారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల నిధులను ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరణతో రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుంది. రోడ్ల మీద వాహనాల రద్దీతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుంది. మెరుగైన రవాణాతో నగరం సమాంతరంగా అభివృద్ధి చెందుతుంది.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఎన్ని ఇళ్లు అమ్మకానికి ఉన్నాయంటే..చెరువుల్లో పట్టా భూములు..చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా ఉద్దేశం మంచిదే. కానీ, ప్రభుత్వం దీన్ని సరైన రీతిలో పరిచయం చేయలేదు. ఇప్పటికీ గ్రేటర్లో చాలా చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ప్రభుత్వం నిర్ధారించలేదు. అయినా ఆగమేఘాల మీద బుల్డోజర్లతో కూల్చివేతలు చేశారు. అలా కాకుండా ముందుగా చెరువులకు కంచె వేసి, బఫర్ జోన్లను నిర్ధారించాలి. గ్రేటర్‌లోని చాలా చెరువుల్లో పట్టా భూములు ఉన్నాయి. ఆయా భూయజమానులకు 400 శాతం ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) భూములను స్వాధీనం చేసుకోవాలి. ఈ విధానాన్ని హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్రమంతటా అమలు చేయాలి. అప్పుడే బాధితులు ముందుకొస్తారు. గతంలో కొనుగోలుదారులు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పర్మిషన్ ఉందా అడిగేవారు కానీ ఇప్పుడు హైడ్రా పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. -
Andhra Pradesh: కాసులకే ఇసుక
⇒ తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో శనివారం 20 టన్నుల ఇసుక కోసం ఓ వినియోగదారుడు అధికారికంగానే రూ.18,570 చెల్లించాడు. ఇదికాకుండా లోడ్ చేసినందుకు రూ.3 వేలు, టోల్గేట్ రూ.660, ఇతరాలన్నీ కలిపి ఇంటికి వెళ్లేసరికి రూ.25 వేలు సమర్పించుకున్నాడు. ⇒ విశాఖలో 20 టన్నుల ఇసుకను రూ.45 వేలకుపైగా చెల్లించి కొనాల్సి వస్తోంది. విజయవాడలోనూ 20 టన్నుల ఇసుక రూ.25 వేలకు తక్కువ దొరకడం లేదు.సాక్షి, అమరావతి:డబ్బులెవరికీ ఊరికే రావు..! ఉచిత ఇసుక కూడా ఊరికే రాదు!!డబ్బులిస్తే మాత్రం ఉచితంగానే వస్తుంది!!విచిత్రంగా ఉన్నా ఇది నిజం! ఉచిత ఇసుక అంటూ రకరకాల విన్యాసాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రీచ్‌లను పచ్చముఠాల చేతుల్లో పెట్టేసి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. ఉచితంగా ఇస్తున్నామని నమ్మబలుకుతూ వినియోగదారుల ముక్కు పిండి వసూలు చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సాధారణ ధరకు ఇసుక దొరికే పరిస్థితి లేకుండాపోయింది. 20 టన్నుల లారీ ఇసుక రూ.25 వేల నుంచి రూ.45 వేలకు పైనే పలుకుతోంది. ట్రాక్టర్ ఇసుకను రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత డబ్బులు కట్టాక ఇక ఉచితం ఏమిటని వినియోగదారులు వాపోతున్నారు. వర్షాకాలంలో అవసరాల కోసం వైఎస్సార్ సీపీ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేయగా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే 40 లక్షల టన్నులను పచ్చముఠాలు అమ్ముకుని సొమ్ము చేసుకోవడం తెలిసిందే. మిగతా ఇసుకను సైతం ఊడ్చేసి నిర్మాణ రంగాన్ని కుదేలు చేయడంతో 40 లక్షల మందికిపైగా కార్మికులు జీవనోపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. వసూళ్లు మామూలేఇసుకపై జీఎస్టీ, సీనరేజీ చార్జీలు రద్దు చేశామంటూ ఇటీవల మంత్రివర్గ సమావేశం అనంతరం కూటమి సర్కారు ప్రకటించింది. అయితే వసూళ్లు మాత్రం ఆగలేదు. తవ్వకం, లోడింగ్ చార్జీలతోపాటు జీఎస్టీ ముక్కుపిండి వసూలు చేస్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. రీచ్‌లన్నీ ప్రైవేట్ చేతిలో పెట్టేసి..ఇసుక రీచ్‌లను టెండర్ల ప్రక్రియ నిర్వహించి మరీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించిన కూటమి సర్కారు ఉచితంగా ఇస్తున్నట్లు బుకాయించడం విడ్డూరంగా ఉందని ప్రజాసంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. టన్ను ఇసుక తవ్వేందుకు రూ.35 నుంచి రూ.120 వరకూ వసూలు చేసేలా టెండర్ వేసి దక్కించుకున్న టీడీపీ నేతలు ఉచితంగా ఎందుకు ఇస్తారనే ప్రశ్నకు ప్రభుత్వం విచిత్రమైన సమాధానాలు చెబుతోంది. ఇసుక కావాల్సిన వారు రీచ్‌లకు నేరుగా కార్మికులను తీసుకెళ్లి తవ్వించుకుని లోడ్ చేయించుకోవాలని ఉచిత సలహాలిస్తోంది! లేదంటే కాంట్రాక్టు సంస్థలకు డబ్బులు కట్టి ఇసుకను తీసుకెళ్లాలంటోంది. రీచ్‌లు లేని చోట్ల సొంత మనుషులకు లైసెన్సులు! ఒకవైపు రీచ్‌లన్నింటినీ టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టేసి మరోవైపు వినియోగదారులు లారీలు, కార్మికులను తీసుకెళ్లి ఇసుక తవ్వించుకుని తీసుకెళ్లాలని ప్రభుత్వం చెప్పడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కాంట్రాక్టర్లకు రీచ్‌లు అప్పగించిన తర్వాత వినియోగదారులు వారిని కాదని ఇసుకను తవ్వించే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వానికి తెలియాలి. ఉచితంగా ఇస్తున్నట్లు చిత్రీకరించే క్రమంలో ఇలాంటి వింత విధానాలు తెచ్చింది. సాధ్యం కాని రీతిలో ప్రజలే ఇసుకను తవ్వించుకోవాలని చెబుతూ పచ్చ ముఠాల దోపిడీకి లైన్ క్లియర్ చేసినట్లు తేటతెల్లమవుతోంది. ఇక ఇసుక రీచ్‌లు లేని జిల్లాల్లో తమ సొంత మనుషులకు మినరల్ డీలర్ లైసెన్సులు ఇచ్చి మరో తరహా దోపిడీకి రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలో ఆయా జిల్లాల్లో ఇందుకు టెండర్లు పిలవనున్నారు. తీసుకెళ్లనివ్వని ‘తమ్ముళ్లు’స్థానిక అవసరాలకు ట్రాక్టర్లు, ఎడ్లబళ్లలో ఎవరైనా ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చన్న ప్రభుత్వ ప్రకటన బోగస్ అని తేలిపోయింది. ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇసుకను లోడ్ చేయించుకునేందుకు టీడీపీ నేతలు ఎక్కడా ఒప్పుకోవడం లేదు. సామాజిక అవసరాలు, వ్యక్తిగత అవసరాలకు ఇసుక తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం చెబుతున్నా స్థానికంగా ఎక్కడా అందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఎవరైనా సరే తమకు డబ్బు కట్టాల్సిందేనని టీడీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. మరోవైపు వారే ట్రాక్టర్లలో ఇసుకను రీచ్‌ల నుంచి ప్రైవేట్ డంప్‌లకు భారీగా తరలించి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. రీచ్‌ల్లో అమ్మకాల కంటే అక్రమ రవాణాయే ఎక్కువగా జరుగుతోంది. ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్నా అది అంత సులభంగా జరిగే ఆస్కారం లేకుండా పోయింది. ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నానా తిప్పలు పడి ఎలాగోలా బుక్ చేసుకున్నా స్లాట్ రావడానికి నాలుగైదు రోజులు పడుతుండటంతో నిర్మాణదారులు లబోదిబోమంటున్నారు.పూతలపట్టు నుంచి బెంగళూరుకు !రోజూ అక్రమంగా ఇసుక తరలిస్తున్న టీడీపీ నేతసాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీ టీడీపీ నేతలకు వరంగా మారింది. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకువెళ్లడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించటంతో ఆ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. అడ్డగోలుగా నదులు, వాగులు, వంకలను తవ్వేస్తున్నారు. ట్రాక్టర్లతో ఇసుకను తరలించి సురక్షిత ప్రాంతాల్లో డంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రిళ్లు ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన ఒక టీడీపీ నేత నిర్వాకమే ఇందుకు నిదర్శనం. పూతలపట్టు మండలం వావిల్‌తోట వంకలోని ఇసుకను టీడీపీ నేత తవ్వించి ట్రాక్టర్లలో తరలించి శివారు ప్రాంతంలోని వినియోగంలో లేని క్రషర్స్, వాటి పరిసర ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. రాత్రి వేళ ఆ ఇసుకను లారీలు, కంటైనర్ల ద్వారా బెంగళూరుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తుండగా ఎవరైనా అడిగితే... తన సొంతానికి అని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇలా 15 రోజులుగా నిత్యం పెద్ద ఎత్తున ఇసుకను అడ్డగోలుగా తవ్వి బెంగళూరుకు తరలిస్తున్నట్లు తెలిసింది. సదరు టీడీపీ నేత ఈ దందాలో మరికొందరు టీడీపీ నాయకులు, అధికారులకు వాటా ఇస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.పెన్నా నదిలో ‘వసూళ్ల గేటు’ఇసుక తీసుకెళుతున్న ఎడ్లబండ్లు, ట్రాక్టర్లకు డబ్బు వసూలు చేస్తున్న టీడీపీ నేతప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అనుచరుడు గుర్రప్ప అలియాస్ గురివిరెడ్డి ఏకంగా పెన్నా నదిలో అనధికార గేటు పెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. ఒంటెద్దు బండికి రూ.150, రెండు ఎడ్ల బండ్లకు రూ.300, ట్రాక్టర్‌కు రూ.1,000 నుంచి రూ.1,200 చెల్లిస్తే కానీ పెన్నా నదిలోకి అనుమతించడం లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా పెన్నా నదిలో గేటు ఏర్పాటు చేశారు. గ్రామ పరిధిలోని కొందరు వ్యక్తులు పెన్నా నదిలోని ఇసుకకు మీకు ఎందుకు గేటు చార్జీలు చెల్లించాలని సోమవారం వాగ్వాదానికి దిగడంతో ఈ పంచాయితీ రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరింది. అయినా ఫలితం లేకపోయింది. గేటు దగ్గర వసూళ్లు యథాతథంగా కొనసాగుతున్నాయి.అక్రమ రవాణాకు అడ్డారామాపురం గ్రామం ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. పెన్నా నది ఒడ్డునే గ్రామం ఉండటంతో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఇక్కడ నుంచి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. మండల పరిధిలోని పెన్నా నది పరీవాహక గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. -
ఇసుక బ్లాక్! సంక్షోభంలో భవన నిర్మాణ రంగం
రాష్ట్రంలో స్థానికంగా ఉండే వారు, వలస వచ్చిన వారితో కలిపి 45 లక్షల మంది భవననిర్మాణ రంగంపై ఆధారపడి పని చేస్తున్నారు. తాపీ పనికి అనుబంధంగా రాడ్ బెండింగ్, సెంట్రింగ్, ఫ్లంబింగ్, పెయింటింగ్, ఫాల్స్ సీలింగ్, మార్బుల్స్, టైల్స్ వంటి 36 రకాల వృత్తుల వారు పని చేస్తున్నారు. ఇసుక లేక నిర్మాణాలు నిలిచి పోవడంతో ప్రస్తుతం వీరందరూ ఉపాధి కోసం ఆయా నగరాలు, పట్టణాల్లోని 4 రోడ్ల కూడళ్లలో ఎదురు చూస్తున్నారు. ఎవరైనా పనికి పిలుస్తారనే ఆశతో పడిగాపులు కాస్తున్నారు. ఇసుక కరువు తమ ఉపాధిని దెబ్బ తీసిందని, నోట్లోకి నాలుగు వేళ్లు పోవడం లేదని వాపోతున్నారు. గతంలో మాదిరిగా ఇసుక సరఫరా యధావిధిగా జరిగితే తప్ప వీరందరికీ పని దొరకదన్నది చేదు నిజం. కాకినాడలో ఇల్లు కట్టుకుంటున్న రాఘవేంద్రరావు ఇసుక కోసం పది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ట్రక్కు ఇసుక దొరికితే పని ఆగకుండా చేయించవచ్చని చూస్తున్నాడు. ఇసుక అమ్మేవాళ్లు, లారీల వాళ్లని అడిగితే లేదని చెబుతున్నారు. ఇసుక పోర్టల్‌లో నేరుగా బుకింగ్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిందని ఎవరో చెబితే దాన్ని చూశారు. అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో, ఎలా బుక్ చేసుకోవాలో ససేమిరా అర్థం కాలేదు. అయినా తెలుసుకుని ఒక రోజు ప్రయత్నించినా దొరకలేదు. దీంతో అతని ఇంటి నిర్మాణం మధ్యలో అగిపోయింది.విజయవాడ రామవరప్పాడు సెంటర్ లేదా బెంజి సర్కిల్లో ఉదయం పూట నిలబడితే భవన నిర్మాణ కార్మికుడు రామారావుకు ప్రతి రోజూ పని దొరికేది. కానీ రెండు నెలలుగా పని దొరకడం ఇబ్బందిగా మారింది. 15 రోజుల నుంచి అది మరీ కష్టమైపోయింది. నిర్మాణాలు ఆగిపోవడంతో పని కోసం పిలిచేవారే కరువయ్యారు. దీంతో అతని ఇల్లు గడవడం కష్టంగా మారింది.ఇసుక అందుబాటులో లేదని తెలుస్తున్నా, ఎలాగోలా కొనాలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేసి చివరికి నానా కష్టాలు పడి పది టన్నుల లారీని బేరమాడాడు గుంటూరుకు చెందిన శివరామకృష్ణ. గతంలో రూ.15,700 ఉండే ధర ఇప్పుడు రూ.43 వేలు చెప్పారు. గుండె గుభేల్మంది. అయినా గత్యంతరం లేక అంత రేటు పెట్టి కొనుగోలు చేయడానికి ఒక రోజు తర్వాత సిద్ధపడ్దాడు. ఆ తర్వాత రోజు అడిగితే రేటు మరో రూ.20 వేలు పెంచి.. రూ.63 వేలు చెప్పారు. ఇలాగైతే ఇల్లు కట్టినట్లేనని బాధను దిగమింగుకుంటున్నాడు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక బంగారంలా మారిపోయిందని చెప్పడానికి ఈ ఉదాహరణలు అద్దం పడుతున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర సహా ఏ ప్రాంతంలోనూ ఇసుక దొరకడం లేదు. పైకి మాత్రం ఉచితంగా ఇసుక ఇస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోంది. కానీ వాస్తవంగా దొరకడమే గగనంగా మారిపోయింది. ఎక్కడైనా అతికష్టం మీద దొరికిన చోట దాని రేటు చూసి నివ్వెరపోవాల్సిందే. గత ప్రభుత్వంలో అమ్మిన రేటు కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటోంది. దీనికంతటికీ కారణం ఉచితం పేరుతో కూటమి ప్రభుత్వ నేతల అడ్డగోలు దోపిడీ విధానమే. వెరసి రాష్ట్రమంతటా భవన నిర్మాణ రంగం సంక్షోభంలో పడిపోయింది. వాస్తవానికి వర్షాకాలంలో ఇసుక సమస్య రావడం సాధారణం. అయితే ప్రభుత్వానికి ముందు చూపు ఉంటే ఈ సమస్య రాదు. కానీ టీడీపీ ప్రభుత్వానికి ఆ ముందు చూపు లేక గత ప్రభుత్వం నిల్వ చేసిన ఇసుకను అడ్డగోలుగా దోచేసింది. వర్షాల సీజన్లో ఇసుక సమస్య రాకుండా చూసేందుకు 80 లక్షల టన్నులకుపైగా ఇసుకను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్టాక్ యార్డుల్లో నిల్వ ఉంచింది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాక.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే మూడు పార్టీల నేతలు ఈ నిల్వలపై బకాసురుల్లా పడ్డారు. ఎక్కడికక్కడ ఇసుక డంప్‌లను కొల్లగొట్టి అమ్మేసుకున్నారు. కేవలం 10–15 రోజుల వ్యవధిలోనే 40 లక్షల టన్నుల ఇసుకను దోచేశారు. మిగిలిన 40 టన్నుల ఇసుకను ఉచితం పేరుతో గత ప్రభుత్వంలో కంటే మూడు నాలుగు రెట్లు అధిక ధరకు విక్రయించారు. గతంలో ఆ మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరేది. ఇప్పుడు కూటమి నేతల జేబుల్లోకి చేరుతోంది. దొరికిన చోట 18 టన్నుల లారీ రూ.35 వేల పైనే.. ఓ వైపు ఇసుక నిల్వల గురించి పట్టించుకోకుండానే మరోవైపు సీఎం చంద్రబాబు తాపీగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించారు. దోచేయగా మిగిలిన 40 లక్షల టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ.. దానికీ రేటు పెట్టారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే ఉచితం పేరుతో దోచుకున్నారు. ఇప్పుడూ అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 18 టన్నుల ఇసుక లారీ రూ.35 వేలకు పైగా పలుకుతోంది. ఇదే సమయంలో టీడీపీ నేతలు ఇసుకను దొంగచాటుగా తరలించి, ఏకంగా రూ.60 వేల వరకు అమ్ముకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. ఉచిత ఇసుక విధానంలో జనానికి ఉపయోగం లేదని, ప్రభుత్వానికీ ఆదాయం లేకుండా పోయిందని.. బాగుపడింది మాత్రం టీడీపీ నేతలు మాత్రమేనని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇసుక నిల్వలన్నీ తరిగి పోవడంతో అసలు ఇసుకే దొరకడం లేదని చెబుతున్నారు. ఇసుక బుకింగ్ ఒక ప్రహసనం ఎక్కడైనా మిగిలిన కొద్దిపాటి ఇసుకకు ప్రభుత్వం ఆన్లైన్ బుకింగ్ పెట్టి దాన్ని ప్రహసనంగా మార్చింది. ఇసుక పోర్టల్‌లో బుకింగ్ చేసుకోవచ్చని చెప్పినా, దాని ద్వారా వారానికి ఒకసారి కూడా బుకింగ్ చేసుకోవడం కుదరడం లేదు. వారంలో ఎప్పుడో ఒకసారి అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇసుక పోర్టల్‌లో బుకింగ్ ఓపెన్ చేస్తున్నారు. నిమిషాల్లోనే వారం రోజుల బుకింగ్‌లన్నీ అయిపోతున్నాయి. సాధారణ జనం ఎవరైనా దాని కోసం ప్రయత్నిస్తే నిద్ర లేకుండా ఎదురు చూడడం తప్ప ఉపయోగం ఉండడం లేదు. నాలుగు వారాలు ప్రయత్నించి ఇటీవల రాజమండ్రి స్టాక్ పాయింట్ నుంచి 20 టన్నుల ఇసుకను బుక్ చేసుకున్న చింతకాయల వీరబాబు అనే వినియోగదారుడి నుంచి భారీగా కట్టించుకున్నారు. ఇక ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తున్నది ఎక్కడన్న ప్రశ్నకు జవాబు లేదు. గతంలో రూ.4 వేలు, 5 వేలకే దొరికే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు రూ.15 వేలు, రూ.20 వేలు పలుకుతోంది. మరోవైపు ఇసుక దొరక్కపోవడంతో పలు ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా పెరిగిపోయింది. నదులు, వాగుల నుంచి అక్రమంగా తవ్వి దాన్ని అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. విశాఖ పరిసర ప్రాంతాలకు ఒడిశా నుంచి భారీ ఎత్తున అక్రమంగా రవాణా అవుతోంది. మన రాష్ట్రంలో దొరక్క పోవడంతో అక్కడి నుంచి కొందరు అక్రమార్కులు ఇసుకను రవాణా చేసి విక్రయిస్తున్నారు. వర్షాల వల్ల నదుల్లో ఇసుక తవ్వకాలు జరగడం లేదని అందువల్లే ఇసుక కొరతని ప్రభుత్వం చెబుతోంది. కానీ వర్షాకాలం కోసం నిల్వ చేసిన నిల్వలు ఏమయ్యాయంటే మాత్రం సమాధానం చెప్పడం లేదు.నిర్మాణాలన్నీ ఆగిపోతున్నాయి..ఇసుక అందుబాటులోకి తెచ్చి తమ ఉపాధి కాపాడాలని వేలాది మంది కార్మీకులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సంక్షోభం నెలకొంది. వెరసి రాష్ట్రంలో నిర్మాణ రంగం స్తంభించిపోయింది. చిన్న, మధ్య తరహా నిర్మాణాలన్నీ నిలిచిపోయాయి. ఒక ట్రాక్టర్ ఇసుక దొరికినా సాగిపోయే పనులు కూడా ఆగిపోయాయి. చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వాళ్లు కూడా ఇసుక దొరక్క నిర్మాణాలు ఆపేశారు. కనీసం చిన్నపాటి రిపేర్లు చేయించుకోవడానికి సైతం ఇసుక దొరక్క పనులు ఆగిపోయాయి. దీంతో దానిపై ఆధారపడి పని చేస్తున్న కార్మీకులు సుమారు 45 లక్షల మంది ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. రాష్ట్రంలో బిల్డింగ్ పనులు చేసే స్థానిక కార్మీకులు 27 నుంచి 30 లక్షల మంది ఉన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు 15 లక్షల మంది కార్మీకులు బిల్డింగ్ పనుల కోసం వలస వచ్చారు. ఒక్క సీఆర్డీఏ పరిధిలోనే 8 లక్షల మంది వలస కార్మీకులున్నట్లు అంచనా. విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో భవన నిర్మాణ రంగం బాగా విస్తరించింది. ఈ నేపథ్యంలో ఇసుక లేక నిర్మాణాలు నిలిచిపోవడంతో లక్షలాది మంది కార్మీకుల ఉపాధికి విఘాతం ఏర్పడింది.100 రోజులైనా ఉచిత ఇసుక లేదుఇసుక లభ్యం కాక నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్లాక్‌లో అక్కడక్కడా దొరుకుతున్నా అంత ధర చెల్లించలేక పనులను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో భవన నిర్మాణ రంగంపై ఆధార పడిన కార్మికులకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఉచిత ఇసుక ఇస్తామని అధికారంలోకి వచ్చి 100 రోజుల దాటినా, నేటికి ఇవ్వడంలేదు. మరింత రేట్లు పెంచేశారు.– గొట్టిపాటి సాల్మన్ రాజు, సెంట్రింగ్ మేస్త్రీ, సత్తెనపల్లి, పల్నాడు జిల్లారాష్ట్రమంతా అదే దందా⇒ వైఎస్సార్ జిల్లాలో ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకోవడానికి వీలవ్వడం లేదు. ఒక వేళ ఎవరికైనా బుకింగ్ అయినా సరఫరా కావడం లేదు. జిల్లాలో ఒకే ఒక్క స్టాక్ పాయింట్ వీరపునాయునిపల్లె మండలం ఎర్రబల్లి ప్రాంతంలో మాత్రమే ఉంది. అక్కడ నిల్వలు నిండుకున్నాయి. దీంతో ఇసుక కొరత వల్ల జిల్లాలో సుమారు 16 వేల వరకు ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. అన్నమయ్య జిల్లాలో బుడుగుంటపల్లె వద్ద ఒకే ఒక ఇసుక రీచ్, స్టాక్ పాయింట్ ఉంది. అక్కడా ఇదే పరిస్థితే. దాదాపు 15వేల మంది భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకడం లేదు.⇒ పల్నాడు జిల్లాలోని ఆరు స్టాక్ పాయింట్స్లలో ఇసుక ఖాళీ అయ్యింది. దీంతో ఇసుక బుకింగ్ నిలిపివేశారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా భవన నిర్మాణ రంగంపై ఆధార పడిన 90 వేల మంది ఉపాధి కోల్పోయారు. ఇసుక ధర భారీగా పెరగడంతో ఓ మోస్తరు ఇంటి నిర్మాణానికి రూ.70 వేల నుంచి రూ.90 వేలు అదనంగా భారం పడుతోంది. సుమారు 20 వేల ఇళ్ల నిర్మాణం మధ్యలో నిలిచిపోయింది. ⇒ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలినాళ్లలో పెద్దాపురం స్టాక్ పాయింట్ నుంచి కాకినాడ జిల్లాలోని తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న నేతలు ఐదారు రోజుల వ్యవధిలోనే ఇసుకను ఖాళీ చేసేశారు. ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో తప్ప అధికారికంగా ఎక్కడా దొరకడం లేదు. జగ్గంపేట నియోజకవర్గంలో 18 టన్నుల లారీకి రూ.27–30 వేలు పెట్టాల్సి వస్తోంది. 97 వేల మందికి ఉపాధి కరువైంది.⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా ఇసుక లభ్యత లేదు. బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. భీమవరానికి లారీ ఇసుక తెచ్చేందుకు రూ.35 వేలు, ఉండికి రూ.32 వేలు, నరసాపురానికి రూ.26 వేలు, తాడేపల్లిగూడేనికి రూ.30 వేలు ఖర్చవుతోంది. గత ప్రభుత్వంతో పోలిస్తే లారీకి రూ.10 వేలకు పైగానే అదనపు భారం పడుతోంది. దీంతో పనులు ఆగిపోయాయి. వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాలకు పనుల కోసం వెళ్లిపోతున్నారు.⇒ అనంతపురం జిల్లాలోని 31 మండలాలకు ఒకే ఒక ఇసుక స్టాక్‌పాయింట్‌ను రాయదుర్గం మండలం జుంజురాంపల్లిలో ఏర్పాటు చేశారు. అక్కడ సైతం ఇసుక అరకొరగానే అందుబాటులో ఉంది. దీంతో జిల్లా కేంద్రానికి తరలించాలంటే అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో 25 వేల ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది.⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికారికంగా ఇసుక లభ్యత లేదు. విజయవాడలో బ్లాక్‌లో 18 టన్నుల ఇసుక రూ.30 వేలు పలుకుతోంది. అంత ధర పెట్టలేక సుమారు 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. కొన్నిచోట్ల టీడీపీ నేతలు ఎడ్ల బండ్లతో ఇసుకను బయటకు తెప్పించి, అధిక ధరతో విక్రయిస్తున్నారు.⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రస్తుతం ఇసుక లభ్యత లేదు. గౌతమి, వశిష్ట, వైనతేయ నదీ పాయల్లో వరద నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో ప్రస్తుతం ఇసుక ర్యాంపులు తెరిచేందుకు అవకాశం లేదు. కూటమి నేతలు అనాలోచితంగా జూలై నాటికే స్టాక్ పాయింట్లలోని ఇసుకను కాజేశారు. ప్రస్తుతం చిన్న చిన్న రిపేర్ల పనులు మాత్రమే సాగుతున్నాయి. కొంత మంది దళారులు ఇసుక నిల్వ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. సుమారు లక్ష మందికి ఉపాధి కరువైంది.⇒ ఉమ్మడి కర్నూలు, విజయనగరం జిల్లా గుంటూరు, తూర్పుగోదావరి, ఉమ్మడి చిత్తూరు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లా , శ్రీకాకుళం జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, విశాఖ జిల్లా, ప్రకాశం జిల్లాల్లో కూడా ఇసుక కొరత తీవ్రంగా ఉంది. గతంలో కంటే ధరలు అధికంగా ఉన్నాయి. దీంతో నిర్మాణాలను ఆపేస్తున్నారు. కొత్తగా నిరి్మస్తున్న ఒక్కో ఇంటిపై రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలు అదనపు భారం పడుతోంది. ఒక్కో అపార్ట్మెంట్ నిర్మాణానికి అదనంగా రూ.30 లక్షల వరకు ఖర్చవుతోంది.ఉపాధి కోల్పోతున్నాంప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇసుక కొరత వేధిస్తోంది. పనులు ఎక్కడిMý్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక నగదు వసూళ్లు చేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసం? – మునస్వామి, భవన నిర్మాణ కార్మికుడు, చిత్తూరుమాకు ప్రత్యేక భృతి ఇవ్వాలిభవన నిర్మాణ పనుల్లో కార్మికులుగా పనిచేస్తూ పొట్ట నింపుకుంటున్నాం. ఇప్పుడేమో ఇసుక కొరత వల్ల పనుల్లేవు. ఇంటి వద్ద ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. మా సమస్యలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోదు. మా ఇల్లు గడవాలంటే ప్రభుత్వమే ప్రత్యేకంగా భృతి ఇవ్వాలి. లేదా ఇసుక కొరత అయినా తీర్చాలి. – డేవిడ్, భవన నిర్మాణ కార్మికుడు, చిత్తూరుఇలా జరగడం ఇదే ప్రథమంకమ్మి, ఇటుకలు, సిమెంట్ దొరక్క ఇంటి నిర్మాణాలకు ఆటంకాలు చూశాం. తొలిసారిగా ఇసుక కొరతతో ఇళ్ల నిర్మాణం ఆగిపోవడం చూస్తున్నాం. తిరుపతి జిల్లా వ్యాప్తంగా స్వర్ణముఖి నది నుంచి ఇసుక రావాలి. అధికార పార్టీ నేతలు అనధికారికంగా మాత్రమే ఇసుక తీసి అధిక ధరకు అమ్ముతున్నారు. దీంతో నిర్మాణాలు నిలిచి పనులు కోల్పోయాం. – గడ్డం గురవయ్య, తాపీ మేస్త్రీ, వాకాడుపనులు ఆపేస్తున్నారుఇసుక అందుబాటులో లేని కారణంగా ఉపాధి కోసం భవన నిర్మాణ కార్మికులు వలస వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ఉచిత ఇసుక ఇవ్వలేకపోతోంది. ధర బాగా ఎక్కువగా ఉందని ఇంటి యజమానులు నిర్మాణ పనులు ఆపేస్తున్నారు. దీంతో మాకు పనుల్లేక ఇబ్బంది పడుతున్నాం. – సురేష్, తాపీ మేస్త్రీ, నెల్లూరువలస వెళ్తున్నారు ఇసుక కొరతతో పనులు లేక కుటుంబ పోషణ భారంగా మారడంతో కార్మికులు పనుల కోసం తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక అందిస్తామన్నారు. కానీ డబ్బులు పెట్టినా దొరకడం లేదు. – షేక్ ఖాజావలి, తాపీ మేస్త్రీ, కంభంఇసుక కొరత తీర్చకపోతే ఆత్మహత్యే శరణ్యంనేను 20 ఏళ్లుగా బిల్డర్‌గా కొనసాగుతున్నాను. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇసుక కొరత మమ్మల్ని వేధిస్తోంది. ఇళ్ల యజమానులకు నిర్ణీత సమయంలో భవనం పూర్తి చేసిస్తామని వారి నుంచి కొంత మొత్తం తీసుకున్నాం. ఇసుక దొరక్క బ్లాక్‌లో అధిక ధరలు పలకటంతో భవనాలు మధ్యలో ఆపేశాను. ఇంటి యజమానులు మమ్మల్ని తీవ్రంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇసుక బ్లాక్‌లో కొని కట్టిద్దామనుకుంటే ఒక బిల్డంగ్పై దాదాపు రూ.2 లక్షలు అధికంగా ఖర్చు వస్తుంది. ఇలాగైతే మాకు లాభాలు రావాల్సింది పోయి భారీగా నష్టాలు వస్తాయి. ప్రభుత్వం ఇసుక కొరత లేకుండా మమ్మల్ని ఆదుకోవాలి. లేకుంటే ఆత్మహత్యే శరణ్యం.– సుధాకర్, బిల్డర్, నంద్యాల -
నిర్మాణ రంగంలో డ్రోన్ నైపుణ్యాల శిక్షణ.. ప్రముఖ సంస్థల ఎంఓయూ
గౌహతి: నిర్మాణ రంగంలో డ్రోన్ నైపుణ్యాలను పెంపొందించేందుకు భారతదేశంలోని ప్రముఖ డ్రోన్ పైలట్ శిక్షణా సంస్థ ఇండియా డ్రోన్ అకాడమీ (IDA), నిర్మాణ పరిశ్రమ నైపుణ్యాభివృద్ధి సంస్థ కన్స్ట్రక్షన్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (CSDCI) అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. శుక్రవారం (ఆగస్ట్ 11) గౌహతిలో జరిగిన కార్యక్రమంలో ఐడీఏ సీఈవో దేవిరెడ్డి వేణు, సీఎస్‌డీసీఐ సీఈవో నరేంద్ర దేశ్‌పాండే ఎంవోయూ పత్రాలను మార్చుకున్నారు. నేషనల్ ఆక్యుపేషనల్ స్టాండర్డ్స్ (NOS), నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (NSQF) స్థాయిల ప్రకారం నిర్మాణ కార్మికులు, నిపుణులకు నాణ్యమైన డ్రోన్ శిక్షణ అందించడం ఈ ఎంఓయూ లక్ష్యం. కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ), బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ), నేషనల్ హైవేస్ బిల్డర్స్ ఫెడరేషన్ (ఎన్‌హెచ్‌బీఎఫ్), కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ద్వారా ప్రమోట్ చేసిన సీఎస్డీసీఐతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని దేవిరెడ్డి అన్నారు. సీఎస్‌డీసీఐ, ఐడీఏ ద్వారా దేశవ్యాప్తంగా 3500 మంది పైలట్లకు శిక్షణ ఇవ్వబోతోందని, డ్రోన్ పైలట్ శిక్షణా కార్యక్రమాల కోసం పౌర విమానయాన శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి గుర్తింపు పొందినట్లు ఆయన చెప్పారు. దేశంలోనే అతిపెద్ద ఉపాధి కల్పనలో ఒకటైన నిర్మాణ పరిశ్రమలో నైపుణ్యాల అభివృద్ధికి సీఎస్‌డీసీఐ కట్టుబడి ఉందని సీఈవో నరేంద్ర దేశ్‌పాండే తెలిపారు. నిర్మాణ ప్రాజెక్టుల సామర్థ్యం, భద్రత, నాణ్యతను మెరుగుపరచడానికి డ్రోన్లకు అపారమైన సామర్థ్యం ఉందని, నిర్మాణ కార్మికులకు డ్రోన్ నైపుణ్యాలను అందించడానికి సీఎస్‌డీసీఐ ఐడీఏతో చేతులు కలపడం సంతోషంగా ఉందన్నారు. డ్రోన్ శిక్షణా కోర్సులను అందించడానికి, అసెస్మెంట్లు, సర్టిఫికేషన్లను నిర్వహించడానికి, ట్రైనీలకు ప్లేస్మెంట్ సహాయం అందించడానికి రెండు సంస్థలు పరస్పరం కలిసి పని చేసేందుకు ఈ ఎంఓయూ అనుమతిస్తుంది. రెండు సంస్థల మధ్య అవగాహన, వనరుల మార్పిడిని కూడా సులభతరం చేస్తుంది. ఏరియల్ సర్వే, ఇన్స్పెక్షన్, మ్యాపింగ్, మానిటరింగ్, డాక్యుమెంటేషన్ వంటి వివిధ పనులను చేయగల నైపుణ్యం కలిగిన డ్రోన్ పైలట్ల సమూహాన్ని సృష్టించడం ద్వారా ఈ ఎంఓయూ నిర్మాణ రంగానికి ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. -
ఇసుకలో బురద తవ్వకాలు!
సాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ.. రాష్ట్రంలో ఇసుక దొరకట్లేదు, పనుల్లేక కార్మికులు అల్లాడుతున్నారంటూ కన్నీళ్లు కార్చిన ఆషాఢభూతి లాంటి ఓ పెత్తందారుడు ఇప్పుడిక రీచ్‌ల నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతోందంటూ కొత్త రాగం అందుకున్నాడు! వర్షాకాలం బురదతో పోటీపడి మరీ వరుస కథనాలను అచ్చేసి మురిసిపోతున్నాడు!! డిమాండ్‌కు అనుగుణంగానే.. రాష్ట్రంలో ఇసుక కొరత తలెత్తి నిర్మాణ రంగం సంక్షోభంలో కూరుకుపోవాలి! పెద్ద ఎత్తున జరుగుతున్న పేదల ఇళ్ల నిర్మాణాలు ఆగిపోవాలి. అభివృద్ధి పనులను అడ్డుకుని ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించాలి!! ఇదీ ఈనాడు ప్రణాళిక! అందులో భాగమే ఇసుక రీచ్‌లపై అబద్ధాలను పోగేసి నిత్యం తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది. ఏటా రాష్ట్రంలో 2 కోట్ల టన్నుల ఇసుక వినియోగం నమోదవుతోంది. అందుకు అనుగుణంగానే తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎక్కడా ఇసుక కొరత లేదు. వర్షాకాలం దృష్ట్యా ముందస్తుగానే డిపోల్లో నిల్వలను అందుబాటులో ఉంచుతున్నారు. పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా ప్రభుత్వం జీవో 71 జారీ చేయడమే కాకుండా పక్కాగా అమలు చేస్తోంది. పక్కా పారదర్శక విధానాలు ఇప్పుడు పారదర్శక ఇసుక విధానంతో ఏటా రూ.760 కోట్ల ఆదాయం లభిస్తోంది. టన్ను ఇసుకను రూ.475కి విక్రయిస్తుండగా రూ.375 ప్రభుత్వానికి రాయల్టీగా వస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ రేటుకు అమ్మేందుకు వీలులేదు. ఇసుక రీచ్‌లు, డిపోల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే రవాణా ఖర్చులు వసూలు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఎంత చెల్లించాలో ప్రభుత్వమే ఈనాడు సహా అన్ని ప్రధాన పత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రచారం చేస్తోంది. వినియోగదారుడు సొంతంగా సమకూర్చుకున్న వాహనం ద్వారా కూడా నిర్ణీత రుసుము చెల్లించి ఇసుకను తరలించుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రం మొత్తం జేపీ సంస్థ ఆధ్వర్యంలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రతి నెలా జేపీ సంస్థ సమర్పించే వివరాలను గనులశాఖ అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విజిలెన్స్ స్వా్కడ్స్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)తో తనిఖీలు చేస్తున్నారు. అక్రమ ఇసుక మైనింగ్, రవాణాకు పాల్పడితే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించేలా చట్టం చేశారు. నాడు ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలను ఎన్జీటీ తీవ్రంగా తప్పుబట్టింది. పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు ఏకంగా రూ.100 కోట్ల జరిమానా విధించింది. అదే ఎన్జీటీ ఇప్పుడు ఇసుక పాలసీకి సంబంధించి తీసుకున్న చర్యలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. టీడీపీ సర్కారు తప్పిదాలకు విధించిన రూ.వంద కోట్ల జరిమానాను కూడా రద్దు చేసింది. ఈ విషయం ’ఈనాడు’ పత్రికకు, రామోజీరావుకు తెలియదా? లేక నటిస్తున్నారా? నాడు చంద్రబాబు సర్కారు సహజ వనరులను దోచేసింది. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అడ్డొచ్చిన అధికారులను జుత్తు పట్టుకుని ఈడ్చుకెళ్లింది. ప్రభుత్వానికి రావాల్సిన రూ.4 వేల కోట్ల ఇసుక ఆదాయాన్ని మింగేసింది. -
ఈపీసీ రంగంలో టెక్ నిపుణులు
ముంబై: నిర్మాణ రంగంలోని ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) విభాగంలో టెక్ నిపుణుల నియామకాలు ఊపందుకున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. ఈ రంగంలోని సంస్థలు నిలకడగా టెక్నాలజీ ప్రమాణాల పెంపు(అప్‌గ్రెడేషన్)ను చేపడుతుండటం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వ దృష్టి వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నట్లు సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ నివేదిక తెలియజేసింది. ‘దేశ ఈపీసీ రంగంలో నేటి ఉపాధి ధోరణి(ట్రెండ్)–2023 ఫిబ్రవరి’ పేరిట రూపొందించిన నివేదికలో ఇంకా పలు అంశాలను ప్రస్తావించింది. 2023 బడ్జెట్ నేపథ్యంలో నెలకొన్న సానుకూల పరిస్థితులు ఈపీసీ రంగంలో టెక్ నిపుణులకు డిమాండును పెంచినట్లు పేర్కొంది. అటు అత్యుత్తమ స్థాయి యాజమాన్యం, ఇటు కొత్తవారికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడినట్లు తెలియజేసింది. టెక్నాలజీయేతరాల్లో.. నివేదిక ప్రకారం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్(2,367 ఉద్యోగాలు) తదుపరి టెక్నాలజీయేతర రంగాలలో ఈపీసీ 11 శాతం వాటాతో అగ్రస్థానాన్ని ఆక్రమిస్తోంది. ఆపై బ్యాంకింగ్ 10 శాతం, ఎఫ్ఎంసీజీ రంగం 3 శాతం, ఫార్మా 2 శాతం చొప్పున నిలుస్తున్నాయి. ఈ నివేదికను సీఐఈఎల్ హెచ్ఆర్ 80,000 మందికి ఉపాధి కల్పించిన 52 ఈపీసీ కంపెనీలపై చేపట్టిన సర్వే ఆధారంగా రూపొందించింది. 2023 జాబ్ పోర్టళ్లలో నమోదు చేసిన 21,865 ఉద్యోగాలనూ విశ్లేషణకు పరిగణించింది. ఈపీసీ కంపెనీలు సాంకేతికతలను నిరంతరంగా అప్‌గ్రేడ్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఫుల్ స్టాక్ డెవలపర్లు, జావా డెవలపర్లు, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టులు, ఇంటెగ్రేషన్ నిపుణులను నియమించుకుంటున్నాయి. సాఫ్ట్వేర్ నిపుణుల ఎంపికలో బెంగళూరు( 19 శాతం), ఢిల్లీ–ఎన్సీఆర్(18 శాతం) టాప్ ర్యాంకులో నిలిచాయి. కార్యకలాపాల డిజిటైజేషన్, సామర్థ్యం, కస్టమర్ సేవల మెరుగు తదితరాల కోసం ఈపీసీ కంపెనీలు ఐటీ నిపుణులను ఎంచుకుంటున్నాయి. మౌలికాభివృద్ధిపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి కారణంగా ఈ రంగం వేగవంతంగా విస్తరించనున్నట్లు సీఐఈఎల్ హెచ్ఆర్ ఎండీ, సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా పేర్కొన్నారు. దీంతో గతంలోలేని విధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నట్లు అభిప్రాయపడ్డారు. -
20 శాతం వృద్ధి: టాటా హిటాచీ
కోల్‌కత: నిర్మాణ రంగానికి అవసరమైన యంత్రాల తయారీలో ఉన్న టాటా హిటాచీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15–20 శాతం ఆదాయ వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. 2021–22లో కంపెనీ రూ.4,000 కోట్ల టర్నోవర్ సాధించింది. అధిక విలువ కలిగిన మైనింగ్ యంత్రాలకు డిమాండ్ నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల పరిమాణం 10–12 శాతం అధికం కానుందని టాటా హిటాచీ ఎండీ సందీప్ సింగ్ తెలిపారు. ‘మౌలిక రంగం నుంచి డిమాండ్ వృద్ధి 12–15 శాతం ఉంది. మైనింగ్ విభాగం నుంచి ఇది 20–25 శాతానికి ఎగసింది. మొత్తం విక్రయాల్లో మైనింగ్ విభాగం యూనిట్ల పరంగా 8 శాతం సమకూరుస్తోంది. వచ్చే మూడేళ్లలో ఈ సెగ్మెంట్ వాటా 15 శాతానికి చేరనుంది. పొరుగు దేశాలు ఆర్థిక కారణాల వల్ల దిగుమతులను తగ్గించిన తర్వాత మధ్యప్రాచ్య, ఆఫ్రికా వంటి కొత్త భౌగోళిక ప్రాంతాలలో ఎగుమతులు పెరగడానికి కంపెనీ కృషి చేస్తోంది. ఎగుమతులు ప్రస్తుతం మొత్తం వ్యాపారంలో ఏడు శాతం వాటాను కలిగి ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో ఎగుమతుల వాటా 10 శాతానికి చేరాల్సి ఉంది’ అని వివరించారు. జేవీలో హిటాచీకి 60 శాతం, టాటా కంపెనీకి 40 శాతం వాటా ఉంది. కర్నాటకలోని ధార్వాడ్, పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో కంపెనీకి ప్లాంట్లు ఉన్నాయి. -
ఢిల్లీలో నిర్మాణ కార్యకలాపాలు బంద్
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్య స్థాయి పెరగడంతో నివారణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఢిల్లీలో శనివారం సాయంత్రం నాలుగింటికి 24 గంటల సగటు వాయు నాణ్యత సూచీ 397కు పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే ఇంతగా గాలి కాలుష్యం నమోదవడం ఇదే తొలిసారి. దీంతో సూక్ష్మ ధూళి కణాలు గాల్లో మరింతగా పెరగకుండా చూసేందుకు నిర్మాణ కార్యక్రమాలను ఆపాలని, కూల్చివేతలకు స్వస్తిపలకాలని కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(సీఏక్యూఎం) శనివారం ఆదేశాలు జారీచేసింది. దేశ భద్రత, రక్షణ, రైల్వే, మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులకు మినహాయింపునిచ్చింది. బీఎస్–3 పెట్రోల్, బీఎస్–4 డీజిల్ వాహనాల రాకపోకల నిషేధానికి నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సీఏక్యూఎం సూచించింది. చలి పెరగడం, ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతో వెలువడే పొగ ఢిల్లీని కమ్మేస్తోంది. నిషేధకాలంలో బోర్లు వేయడం, డ్రిల్లింగ్, వెల్డింగ్, రోడ్ల నిర్మాణం, మరమత్తు, ఇటుకల తయారీ, తదితర నిర్మాణరంగ పనులను చేయకూడదు. -
అక్కడుంది లివింగ్‌స్టోన్.. 'కన్స్ట్రక్షన్ సైట్లోకి బంతి'
Liam Livingstone Hit 88 Meters Big Six.. మ్యాచ్ స్వరూపాన్ని క్షణాల్లో మార్చేయ గల సత్తా ఉన్న ఆటగాడు లయామ్ లివింగ్‌స్టోన్. ఈ ఇంగ్లండ్ క్రికెటర్ భారీ సిక్సర్లకు పెట్టింది పేరు. బంతిని కసితీరా బాదే లివింగ్‌స్టోన్ సిక్స్ కొట్టాడంటే స్టేడియం అవతల పడాల్సిందే. ఇప్పటికే ఇలాంటి సిక్సర్లు చాలానే చూశాం. తాజాగా టీమిండియాతో మూడో వన్డేలో లివింగ్‌స్టోన్ భారీ సిక్సర్లు బాదాడు. ఇన్నింగ్స్ 34వ ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్ కొట్టిన ఒక సిక్సర్ గ్రౌండ్కున్న ఫెన్నింగ్ ప్లేట్‌కు తగలడంతో పెద్ద బొక్క పడింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ 36 ఓవర్లో మరోసారి హార్దిక్ బౌలింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతినే లివింగ్‌స్టోన్ డీప్ స్వ్కేర్‌లెగ్ మీదుగా భారీ సిక్సర్ సంధించాడు. 88 మీటర్ల ఎత్తులో వెళ్లిన ఆ బంతి నేరుగా స్టేడియం బయట ఉన్న కన్స్ట్రక్షన్ సైట్లో పడింది. అక్కడ పనిచేస్తున్న కార్మికులు బంతిని గ్రౌండ్లోకి విసిరేయడం విశేషం. ఇది గమనించిన హార్దిక్ లివింగ్స్టోన్వైపు చూస్తూ.. ''ఎంత పెద్ద సిక్స్'' అన్నట్లుగా నవ్వుతూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Hasan Ali: అంతుపట్టని డ్యాన్స్‌తో అదరగొట్టిన పాక్ బౌలర్ -
చౌక ఇళ్ల రుణ విభాగంపై ప్రభావం
ముంబై: అందుబాటు ధరల్లోని (అఫర్డబుల్) ఇళ్లకు గృహ రుణాలను అందించే కంపెనీలపై పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా నిర్మాణ రంగ వ్యయాలు పెరిగిపోతాయని పేర్కొంది. ఇది అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానించేందుకు దారితీస్తుందని విశ్లేషణ వ్యక్తం చేసింది. రూ.25 లక్షలు, అంతకంటే దిగువ బడ్జెట్ ఇళ్లను అఫర్డబుల్‌గా చెబుతారు. ఆర్థిక అనిశ్చితుల ప్రభావం ఈ విభాగంపై ఎక్కువగా ఉండదని లోగడ నిరూపితమైందంటూ.. గడిచిన దశాబ్ద కాలంలో ఈ విభాగం వేగంగా పురోగతి సాధించిందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. గత ఐదేళ్ల కాలంలో చూస్తే హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్లో వృద్ధిని.. అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి అధిగమించడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఈ విభాగంలో తొలుత కొంత జోరు కనిపించినప్పుటికీ అది ఇప్పుడు సాధారణ స్థాయికి దిగొచ్చిందని పేర్కొంది. ‘‘అధిక ద్రవ్యోల్బణం కారణంగా రుణ గ్రహీతల వద్ద నగదు ప్రవాహం తగ్గిపోతుంది. నిర్మాణ వ్యయాలు పెరగడం వల్ల ప్రాపర్టీ ధరలు పెరగడమే కాకుండా, కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టులు తగ్గుతాయి. ప్రభుత్వం అత్యవసర రుణ హామీ పథకాన్ని నిలిపివేయడం అనే సవాలును ఈ విభాగం ఎదుర్కొంటోంది’’ అని ఇండియా రేటింగ్స్ నివేదిక వివరించింది. ఇటీవలి కాలంలో ఆర్బీఐ 0.90 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. ఈ చర్యతో బ్యాంకులు సైతం వెంటనే పలు రుణాల రేట్లను సవరించేశాయి. ప్రస్తుత రెపో రేటు కరోనా ముందున్న రేటు కంటే పావు శాతం తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో హౌసింగ్ ఫైనాన్స్ (గృహ రుణాలు) మార్కెట్ 13 శాతం వృద్ధిని చూపిస్తుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. పెరగనున్న భారం ‘‘ఒక శాతం మేర వడ్డీ రేట్లు పెరిగితే రుణాల ఈఎంఐ 6.1–6.4 శాతం మేర పెరుగుతుంది. అందుబాటు ధరల ఇళ్ల రుణ గ్రహీతలపై ఈ పెరుగుదల 5.3 శాతంగా ఉంటుంది’’అని ఈ నివేదిక వివరించింది. వడ్డీ రేట్ల సైకిల్ ఇలానే ముందుకు సాగితే 2 శాతం మేర రేటు పెరగడం వల్ల ఈఎంఐపై పడే భారం 10.8–13 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది. ‘‘ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కాల వ్యవధి పెంచడం ద్వారా (ఈఎంఐ పెంచకుండా) రుణ దాతలు ఆ ప్రభావాన్ని అధిగమించగలరు. కొత్త కస్టమర్లకు మాత్రం పెరిగిన రేట్ల మేర ఈఎంఐ అధికమవుతుంది. ఇది ఇల్లు కొనుగోలు సెంటిమెంట్‌ను మధ్య కాలానికి ప్రతికూలంగా మార్చేయవచ్చు’’అని ఈ నివేదిక వివరించింది. నిర్మాణంలో వాడే సిమెంట్, స్టీల్, కాంక్రీట్ సహా ఎన్నో ముడి సరుకుల ధరల గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావించింది. కార్మికులకు చెల్లింపులు కూడా పెరిగిన విషయాన్ని పేర్కొంది. నిర్మాణ వ్యయం 20–25 శాతం మేర పెరిగేందుకు ఈ అంశాలు దారితీశాయని తెలిపింది. పెరిగిన ధరల ప్రభావాన్ని నిర్మాణదారులు పూర్తిగా కొనుగోలుదారులకు బదిలీ చేయలేవని పేర్కొంటూ.. మధ్య కాలానికి ప్రాపర్టీ ధరలపై ఇవి ప్రతిఫలిస్తాయని అంచనా వేసింది. -
జింజర్..పవర్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఇంజినీరింగ్ టీమ్
‘తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరు?’ అని అడిగితే చెప్పడం కష్టం కావచ్చుగానీ ‘జింజర్’ నిర్మాణానికి మేధోశక్తిని ఇచ్చిన వారు ఎవరు? అని అడిగితే జవాబు చెప్పడం మాత్రం సులభం! ఏమిటి జింజర్? ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్(ఐహెచ్సిఎల్), టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ముంబైలోని శాంతక్రూజ్లో శ్రీకారం చుట్టిన జింజర్ హోటల్‌కు ఆల్–ఉమెన్ ఇంజినీరింగ్ టీమ్ నిర్మాణ సారథ్యం వహిస్తుంది. నిర్మాణరంగంలో స్త్రీల ఉన్నతావకాశాలకు సంబంధించి ఇది గొప్ప ముందడుగు అని చెప్పవచ్చు. ‘అనేక రంగాలలో స్త్రీలు తమను తాము నిరూపించుకుంటున్నారు. తమ ప్రతిభతో ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ టీమ్ విజయం వారి వ్యక్తిగత విజయానికి మాత్రమే పరిమితం కాదు. నిర్మాణం, ఇంజినీరింగ్ రంగాలలో ఉన్నత అవకాశాలు వెదుక్కోవడానికి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నారు ఐహెచ్సిఎల్ సీయివో పునీత్ చత్వాల్. ఆల్–ఉమెన్ టీమ్ ఏమిటి? మగవాళ్లు పనిచేయడానికి సుముఖంగా లేరా!...అంటూ అమాయకంగానో, అతి తెలివితోనో ఆశ్చర్యపోయేవాళ్లు ఉండొచ్చునేమో. అయితే అలాంటి అకారణ ఆశ్చర్యాలు స్త్రీల ప్రతిభ, శక్తిసామర్థ్యాల ముందు తలవంచుతాయని, వేనోళ్ల పొగుడుతాయని చరిత్ర చెబుతూనే ఉంది. కొన్నిసార్లు కట్టడాలు కట్టడాలుగానే ఉండవు. అందులో ప్రతి ఇటుక ఒక కథ చెబుతుంది. స్ఫూర్తిని ఇస్తుంది. శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. 371 గదులతో నిర్మాణం కానున్న జింజర్ ఇలాంటి కట్టడమే అని చెప్పడానికి సందేహం అవసరం లేదు. -
నిర్మాణ రంగానికి కేంద్రం బూస్ట్
న్యూఢిల్లీ: నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న నిధుల లభ్యత (లిక్విడిటీ) సమస్యను నివారించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఆర్బిట్రేషన్ పక్రియలో నిలిచిపోయిన మొత్తంలో 75 శాతం ఈ రంగానికి అందుబాటులోకి వచ్చే విధంగా నిబంధనల రూపకల్పన చేసింది. దీనిప్రకారం, కాంట్రాక్టర్‌కు అనుకూలంగా ఆర్బిట్రల్ అవార్డును (తీర్పు)ను ఒక మంత్రిత్వ శాఖ దాని విభాగం అప్పీలేట్ కోర్టులో సవాలు చేసిన సందర్భంలో అవార్డు ప్రకారం ఇవ్వాల్సిన మొత్తంలో 75 శాతం కాంట్రాక్టర్‌కు ఇకపై లభ్యమయ్యే అవకాశం ఏర్పడింది. అయితే ఇందుకు సంబంధిత కాంట్రాక్టర్ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలకు అమలు... నిజానికి ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ మేరకు ఇప్పటికే నిర్దేశాలు ఉన్నాయి. 2019 నవంబర్‌లో కేంద్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటూ, ఆర్బిట్రేషన్ అవార్డును ఏదైన ప్రభుత్వ రంగ సంస్థ సవాలు చేసిన సందర్భంలో ‘బ్యాంక్ గ్యారెంటీ’పై కాంట్రాక్టర్‌కు ఇవ్వాల్సిన మొత్తంలో 75 శాతాన్ని చెల్లించాలని చెల్లించాలని నిర్దేశించింది. ఇప్పుడు ఈ నిబంధనను మంత్రిత్వశాఖలకూ వర్తింపజేస్తూ నిబంధనలు రూపొందించింది. ఇందుకు సంబంధించి జనరల్ ఫైనాన్షియల్ రూల్ (జీఎఫ్ఆర్)లో 227ఏ కొత్త రూల్‌ను జోడిస్తున్నట్లు వ్యయ వ్యవహారాల శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ‘మంత్రిత్వ శాఖ/డిపార్ట్మెంట్ మధ్యవర్తిత్వ అవార్డ్‌ను సవాలు చేసిన సందర్భాలలో, ఆర్బిట్రల్ అవార్డ్ మొత్తాన్ని చెల్లించనట్లయితే, అవార్డ్‌లో 75 శాతాన్ని కాంట్రాక్టర్/రాయితీదారుకు బ్యాంక్ గ్యారెంటీపై మంత్రిత్వశాఖ /డిపార్ట్మెంట్ చెల్లించాలి‘అని తన తాజా ఉత్తర్వుల్లో కేంద్ర వ్యయ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. మరిన్ని వివరాలు పరిశీలిస్తే... బ్యాంక్ గ్యారెంటీ ఆర్బిట్రల్ తీర్పులో పేర్కొన్న 75 శాతానికి మాత్రమే వర్తిస్తుంది. తదుపరి కోర్టు ఉత్తర్వుల ప్రకారం పేర్కొన్న మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఏర్పడినట్లయితే, మంత్రిత్వ శాఖ/డిపార్ట్మెంట్కు చెల్లించాల్సిన వడ్డీకి ఇది వర్తించబోదు. చెల్లింపులు ఎస్క్రో ఖాతాలోకి జరుగుతాయి. అయితే అంది వచ్చిన డబ్బు వినియోగంలో ముందుగా రుణదాతల బకాయిల చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలి. చెల్లింపుల్లో మిగిలిన మొత్తాన్ని ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఉపయోగించాలి లేదా పరస్పరం అంగీకరించిన, నిర్ణయించుకున్న అదే మంత్రిత్వ శాఖ/ డిపార్ట్మెంట్ ఇతర ప్రాజెక్ట్‌ల పూర్తికి కూడా ఉపయోగించవచ్చు. రుణదాతల బకాయిల పరిష్కారం, అటుపై మంత్రిత్వశాఖ/డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌ల పూర్తి తర్వాత ఎస్క్రో ఖాతాలో మిగిలి ఉన్న ఏదైనా బ్యాలెన్స్‌ను లీడ్ బ్యాంకర్, మంత్రిత్వ శాఖ/డిపార్ట్మెంట్ ముందస్తు అనుమతితో కాంట్రాక్టర్/రాయితీదారు వినియోగించుకోవచ్చు. నిలిపివేసిన ఏదైనా డబ్బు లేదా ఇతర మొత్తాలను కూడా బ్యాంక్ గ్యారెంటీపై కాంట్రాక్టర్‌కు విడుదల చేయవచ్చు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అభిప్రాయం తీసుకుని ఆర్బిట్రల్ తీర్పును, దానిపై ఏదైనా అప్పీల్‌ను పరిష్కరించుకోడానికి (కొట్టివేయించడానికి) తగిన నిర్ణయాన్ని ప్రభుత్వ సంస్థలు తీసుకోవచ్చు. ఆర్బిట్రల్ అవార్డు అప్పీల్స్, ఆయా ఆంశాల పెండింగ్ సందర్భాల్లో కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగడంలేదు. సంబంధిత న్యాయ ప్రక్రియ ముగింపునకు సంవత్సరాలు పడుతున్న నేపథ్యం లో కేంద్రం ఈ చర్యలపై దృష్టి సారించింది. -
‘ఆ తుపాకీని రాజస్తాన్‌లో కొన్నారు’
సాక్షి, హైదరాబాద్: శంకర్ పల్లి, ఆర్సీపురంలో దొంగల ముఠా ఒకటి ఆయుధాలు వాడి కన్స్ట్రక్షన్ సైట్లలో సెక్యూరిటీలను బెదిరించి దొంగతనాలకు పాల్పడ్డ సంగతి తేలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు బుధవారం వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. ‘ఆర్సీ పురం, శంకర్పల్లి ఘటనలతో అంతరాష్ట్ర దొంగలు రాష్ట్రంలోకి వచ్చారని భావించి టీమ్స్ ఏర్పాటు చేశాము. ఖచ్చితమైన సమాచారం మేరకు దొంగలను అరెస్ట్ చేశాం. వారితో పాటు దొంగతనం చేసిన వారి దగ్గర నుంచి మెటీరియల్ కొనేవారిని కూడా అరెస్ట్ చేశాం. వీరిలో మనీష్ అనే ఓ ఎలక్ట్రికల్ షాప్ ఓనర్‌తో పాటు, స్క్రాప్ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తి ఒకరు ఉన్నారు. వారి దగ్గర నుంచి సుమారు 55 లక్షల రూపాయలు విలువ చేసే మెటీరియల్ స్వాధీనం చేసుకున్నాం. 9,50,000 రూపాయల నగదు సీజ్ చేశాం. ఇందులో ప్రధాన నందితులైన యూపీ రాజస్తాన్‌కు చెందిన 11 మందిని అరెస్ట్ చేశాం’ అని తెలిపారు సజ్జనార్. (చదవండి: నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్టు) ఇక ‘నిందితులంతా ఎలక్ట్రిషన్స్.. వీరందరూ ఢిల్లీలో పని చేసినపుడు కలుసుకున్నారు. కొన్ని రోజులు హైదరాబాద్‌లో నిర్మాణ సంస్థలో పని చేశారు. కొల్లూరులో దొంగతనం చేశాక ఆ మెటీరియల్‌ను మనీష్ ఎలక్ట్రికల్ షాపులో అమ్మేశారు. వచ్చిన డబ్బులను జల్సాలకు వాడేవారు. దొంగతనం చేయడానికి వర్క్ కావాలనే సాకుతో సైట్లోకి వెళ్లి రెక్కి నిర్వహించేవారు. ఒకరు వర్క్ గురించి మాట్లాడుతుంటే మరి కొందరు అక్కడ పరిసరాలను గమనించేవారు. ఈ ముఠా రాత్రి 11 నుంచి 3 గంటల మధ్య దొంగతనాలకు పాల్పడేవారు. ఎంసీబీ ప్యానెల్ బోర్డ్లను చోరి చేసేవారు.. వాటిని మనీష్ ఎలక్ట్రికల్ షాపులో అమ్మేవారు’ అని సజ్జనార్ తెలిపారు. (చదవండి: మోస్ట్ వాంటెడ్ ఫహీమ్ దొరికాడు) ఇక మూడు రోజుల క్రితం మాకు ఓ స్పెసిఫిక్ కేసు వచ్చింది...ఇంతకు ముందు ఆర్సీపురం, శంకర్ పల్లి, ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో గట్టి నిఘా ఏర్పాటు చేశాం.. ఎట్టకేలకు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశాము. ఇందులో రాజస్తాన్‌కు చెందిన ప్రదీప్ కుష్వాల్ ప్రధాన నిందితుడిగా గుర్తించాము. ఇన్ఫ్రా కంపెనీలు సెక్యూరిటీ పెంచుకోవాలి. అంతర్గతంగా విజిలెన్స్ ఏర్పాటు చేసుకోవాలి. అలారాలను ఏర్పాటు చేసుకోవాలి..అరెస్ట్ అయిన వారందరిపై పీడి యాక్ట్ పెడతాం. దొంగతనాలు చేసేటప్పుడు బెదిరించటానికి వాడిన తుపాకిని రాజస్తాన్‌లో కొన్నారు’ అని తెలిపారు. -
సిమెంటు కంపెనీల పల్లెబాట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 దేశవ్యాప్తంగా అన్ని రంగాలనూ అతలాకుతలం చేసింది. ఇందులో సిమెంటు రంగం కూడా ఒకటి. కార్మికులు లేక నిర్మాణ రంగం కుదేలైంది. దీంతో సిమెంటుకు డిమాండ్ లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలు సాగుతుండడం కంపెనీలకు కాస్త ఊరటనిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు సిమెంటు రవాణా ఆగిపోవడంతో ఇప్పుడు కంపెనీలు గ్రామాలపై దృష్టిపెట్టాయి. అయితే కార్మికులు తిరిగి వస్తేనే నిర్మాణ రంగం గాడిన పడుతుందన్నది కంపెనీల మాట. జనవరి–మార్చి నాటికి మార్కెట్ సాధారణ స్థితికి వస్తుందని పరిశ్రమ ఆశాభావంతో ఉంది. గ్రామీణ ప్రాంతాలే ఆధారం... ప్రస్తుతం జరుగుతున్న సిమెంటు వినియోగంలో అత్యధికం గ్రామీణ ప్రాంతాల నుంచే జరుగుతోందని భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పట్టణాల్లో నిర్మాణాలు చాలా మందకొడిగా సాగుతున్నాయని చెప్పారు. ఊహించినదానికంటే అధికంగా పట్టణేతర ప్రాంతాల్లో నిర్మాణాలు సాగుతున్నాయని వివరించారు. నిర్మాణ రంగంలో ఇప్పుడు 30% మాత్రమే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కార్మికులు తిరిగి వస్తేనే సిమెంటుకు మంచి రోజులని వ్యాఖ్యానించారు. ప్లాంట్లలో తయారీ 25–30 శాతానికి పడిపోయిందన్నారు. ఇది జూలై–సెప్టెంబరులో 40–50%కి చేరుతుందన్న విశ్వాసం ఉందని చెప్పారు. కార్మికుల ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక రంగ ప్రాజెక్టులపై పెట్టుబడులు చేస్తుందని తాము భావిస్తున్నామని సాగర్ సిమెంట్స్ జేఎండీ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి–మార్చికల్లా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. పదేళ్లుగా ధర అక్కడే..: తెలుగు రాష్ట్రాల్లో పదేళ్లుగా సిమెంటు బస్తా ధర రూ.350 చుట్టూ తిరుగుతోందని రవీందర్ రెడ్డి అన్నారు. ‘ద్రవ్యోల్బణం ప్రకారం చూసుకున్నా ఆ స్థాయిలో ధర పెరగలేదు. ప్లాంట్లలో ఉత్పత్తి 60–65 శాతమైతే బస్తా ధర రూ.350 ఉన్నా సరిపోతుంది. తయారీ 10% తగ్గితే బస్తాపైన వ్యయం రూ.25–30 అధికం అవుతుంది. ఇప్పుడు ప్లాంట్ల సామర్థ్యం 25–30%కి పరిమితమైంది. ఉత్పత్తి లేకున్నా సిబ్బంది వేతనాలు పూర్తిగా చెల్లించాం. ఇవన్నీ కంపెనీలకు భారమే. గతేడాది సగటుతో పోలిస్తే ధర 1% మాత్రమే పెరిగింది. జీఎస్టీ 28 శాతం ఉంది. దీనిని తగ్గించాలని ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నాం’ అని వివరించారు. ఇక రవాణా సమస్యలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు సిమెంటు సరఫరా దాదాపు నిలిచిపోయింది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు సరఫరాపై కంపెనీలు దృష్టిపెట్టాయి. కరోనా నియంత్రణలోకి వస్తేనే రవాణా సమస్యల నుంచి గట్టెక్కుతామనేది కంపెనీల మాట. సిమెంటు అమ్మకాలు ఇలా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జనవరిలో 23 లక్షల టన్నులు, ఫిబ్రవరిలో 17, మార్చిలో 14 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడైంది. కోవిడ్–లాక్డౌన్ ప్రభావంతో ఏప్రిల్‌లో ఇది 3.65 లక్షల టన్నులకు దిగొచ్చింది. అమ్మకాల పరంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఇదే తక్కువ పరిమాణం. మే నెలలో ఇరు రాష్ట్రాలు చెరి 7 లక్షల టన్నుల విక్రయాలు సాధించాయి. ఇందులో ఒక లక్ష టన్నుల మేర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్డర్లే ఉంటాయి. ఇక 2019 మే నెలలో 22 లక్షల టన్నులు కాగా, అదే ఏడాది జనవరిలో అత్యధికంగా 31 లక్షల టన్నుల సిమెంటు విక్రయాలు నమోదయ్యాయి. గత నెలతో పోలిస్తే జూన్ అమ్మకాల్లో 10 శాతం వృద్ధి ఉంటుందని పరిశ్రమ భావిస్తోంది. -
వలస కార్మికులను రప్పించే ప్రక్రియ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : కరోనా భయం.. లాక్‌డౌన్‌తో ఉపాధి కరవు.. వెరసి వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లారు. వారిపై ఆధారపడ్డ అన్ని రంగాలు కుదేలయ్యాయి. లాక్‌డౌన్‌కు సడలింపులు వచ్చి తిరిగి పనులు ప్రారంభమైనా, వలస కూలీలు లేకపోవటంతో ఇప్పుడు ఆ రంగాల్లో పని మొదలుకావట్లేదు. అవి పట్టాలెక్కాలంటే కచ్చితంగా వలస కూలీలు తిరిగి రావాల్సిందే. కాదంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరగాలి. వలస కూలీలే కీలకంగా ఉన్న నిర్మాణ రంగంలో ఇప్పుడు ఈ దిశగా ఏర్పాట్లు మొదలయ్యాయి. సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన వలస కార్మికులను తిరిగి రప్పించే చర్యలు సాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు లక్ష మంది కార్మికులతో సంప్రదింపులు జరిపి వారు తెలంగాణకు తిరిగి వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో 80 వేల మంది వరకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. నిర్మాణ రంగంలో కీలకంగా ఉండే దాదాపు 12 రకాల ట్రేడ్స్‌లో స్థానిక యువకులకు శిక్షణ ఇచ్చి పనిలోచేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బాధ్యతను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) తీసుకుంది. జిల్లాకు వెయ్యి మంది చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. రంగంలోకి లేబర్ కాంట్రాక్టర్లు.. నిర్మాణ రంగానికి సంబంధించి రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేసేవారు. వీరికి సంబంధించి లెక్కల్లో స్పష్టత లేదు. ఏ విభాగం కూడా వీరికి సంబంధించిన అంశాలను నేరుగా పర్యవేక్షించే పద్ధతి లేకపోవటంతో ఎంతమంది, ఏయే రాష్ట్రాలకు చెందిన వారు పనిచేస్తున్నారో లెక్కల్లేవు. అయితే వలస కూలీలను సమకూర్చే బాధ్యత లేబర్ కాంట్రాక్టర్లది. మ్యాన్ పవర్ సప్లయర్స్ తరహాలో వీరు వ్యవహరిస్తారు. బడా నిర్మాణ సంస్థలు తమకు ఎంతమంది కార్మికులు కావాలో వీరికి చెబితే, వీరు ఆయా రాష్ట్రాల్లో నైపుణ్యం ఉన్న వారిని గుర్తించి పనుల్లో పెట్టేవారు. వీరికి ఆయా రాష్ట్రాల్లోని లేబర్ కాంట్రాక్టర్లతో ప్రత్యక్ష సంబంధాలుంటాయి. ఇప్పుడు వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవటంతో వారిని తిరిగి రప్పించే బాధ్యత కూడా లేబర్ కాంట్రాక్టర్లకే అప్పగించారు. బడా నిర్మాణ సంస్థలే ఈమేరకు పురమాయించాయి. దీంతో రంగంలోకి దిగిన లేబర్ కాంట్రాక్టర్లు ఆయా రాష్ట్రాల్లోని కాంట్రాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. అవి క్రమంగా కొలిక్కి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్ఘఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్నవారిలో కదలిక వస్తున్నట్టు సమాచారం. ముందు వెళ్లిన వారే.. సాధారణంగా వలస కార్మికులు ప్రతి సంవత్సరం వారి సొంత ప్రాంతాలకు వెళ్తారు. గత డిసెంబర్ నుంచి లాక్డౌన్ వరకు కూడా దాదాపు 50 వేల మందికిపైగా వెళ్లారు. లాక్డౌన్ తర్వాత దాదాపు రెండున్నర లక్షల మంది వెళ్లారు. వారు ఇప్పటికిప్పుడు తిరిగి వచ్చేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇక గత డిసెంబర్ నుంచి మార్చి లోపు వెళ్లిన వారిపై లేబర్ కాంట్రాక్టర్లు దృష్టి సారించారు. వారు ఈ పాటికే తిరిగి పనుల్లోకి రావాల్సి ఉండగా, లాక్డౌన్ వల్ల సొంత ప్రాంతాల్లోనే చిక్కుకుపోయారు. కొద్ది నెలలుగా పనుల్లేక వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడినట్లు సమాచారం. దీంతో వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పటంతో పాటు, నిర్మాణ స్థలాల్లో ప్రత్యేక జాగ్రత్తలు చేపడుతున్నందున భయం లేదని పేర్కొంటున్నారు. ఆయా కార్మికులు ఉంటున్న ప్రాంతాల్లో కూడా కరోనా ప్రభావం ఉన్నందున, ఆ ప్రాంతం కూడా సురక్షితం కాదని వారు భావిస్తున్నారు. అదే తిరిగి తెలంగాణకు వస్తే డబ్బులు వస్తాయన్న భావనకు వచ్చినట్లు తెలిసింది. ఇలా ఇప్పటివరకు దాదాపు 80 వేల మంది సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గల్ఫ్ నుంచి వచ్చిన వారి కోసం.. కరోనా భయంతో ఎడారి దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలంగాణ కార్మికులు తిరిగి వచ్చారు. వారు పనుల్లేకుండా ఖాళీగా ఉన్నారు. అక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్న నిర్మాణ రంగంలో వీరికి పనిచేసిన అనుభవం ఉంది. దీంతో వీరిని కూడా సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నారు. అందులో వారు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారిని గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గల్ఫ్ దేశాల్లో యంత్రాలతో పని ఎక్కువ. మన వద్ద మనుషులే చేస్తారు. యంత్రాలతో పనులకు అలవాటు పడ్డ వారికి స్వయంగా చేసే విషయంలో శిక్షణ ఇవ్వనున్నారు. వీలైనంత తొందరలో ఈ మొత్తం ప్రక్రియలు పూర్తి చేసి నిర్మాణ రంగానికి ఊపు తేవాలని నిర్మాణ సంస్థలు, న్యాక్ యంత్రాంగం భావిస్తోంది. న్యాక్ కీలక భూమిక ఇప్పటికిప్పుడే యువత పనుల్లోకి వచ్చేలా జిల్లాకు వెయ్యి మంది చొప్పున ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వాలని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నిర్ణయించింది. కనిష్టంగా 30 వేల మంది సిద్ధమవుతారని అంచనా. 12 రకాల ట్రేడ్స్‌లో వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. ప్లంబింగ్, వైరింగ్, తాపీ పని, సెంట్రింగ్, రంగులు వేయడం మొదలు.. సైట్ సూపర్వైజింగ్ వరకు శిక్షణ ఇస్తారు. దశల వారీగా వీరిని సిద్ధం చేస్తారు. తరగతి గదుల్లో శిక్షణ ఇవ్వాలంటే.. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో అనుమతి లేనందున పని ప్రదేశాల్లోనే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు బడా నిర్మాణ సంస్థలతో న్యాక్ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. -
పని ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగానికి కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన నేపథ్యంలో, పని ప్రదేశాల్లో పాటించాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రం శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. పురపాల న, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్వి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే నిర్మాణం జరిగే ప్రాంతాల్లో ఉన్న కార్మికుల క్యాంపులు, లేదా బయటి నుంచి వచ్చే కా ర్మికులు ఈ నిబంధనలు పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. ► రోజూ ఉదయం కార్మికులతో సమావేశం ఏర్పా టు చేసి సామాజిక దూరం పాటించడం వంటి మార్గదర్శకాలు పాటిస్తున్నదీ లేనిదీ సమీక్షించా లి. ప్రతి ఒక్కరికీ ఉదయం, సాయంత్రం వేళల్లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి. పని ప్రదేశం లో సబ్బు, శానిటైజర్లు, నీటిని అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించేలా చూడాలి. పని ప్రారంభించే ముందు, విధు ల నుంచి వెళ్లే సమయంలో తమ చేతులు కడుక్కుని వెళ్లాల్సి ఉం టుంది. పని ప్రదేశంలో ప్రవేశించే ప్రతి ఒక్కరూ మాస్క్‌ను విధిగా ధరించాలి. బయట నుంచి వ చ్చే నిర్మాణ సామగ్రి, పనిముట్లను ఉపయోగిం చే సమయంలో విధిగా చేతి గ్లౌజులు ధరించాలి. గుట్కా, పొగాకు, పాన్ తదితరాలను పని ప్రదేశాల్లో పూర్తిగా నిషేధించడంతో పాటు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం. ► ఒకేచోట గుమికూడకుండా, సామాజిక దూరా న్ని పాటిస్తూ భోజనం చేయాలి. రోజూ సైట్ కా ర్యాలయంతో ప్రవేశ ద్వారాలు, క్యాంటీన్లు, కా ర్మికుల నివాస సముదాయాలు, నడిచే మార్గాలతో పాటు పని ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. పా రిశుధ్య సిబ్బందికి అవసరమైన సామగ్రి అందజేయాలి. పని ప్రదేశంలోకి అవసరం లేని వారి ప్రవేశాన్ని నిషేధించాలి. కరోనాకు చికిత్స అం దించే ఆస్పత్రులు, క్లినిక్‌ల వివరాలను పని ప్రదేశంలో ప్రదర్శించాలి. క్రమం తప్పకుండా వైద్యు డు పని ప్రదేశాన్ని సందర్శించాలి. ► కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుగు లేదా హిందీలో కార్మికులకు అర్థమయ్యే భాషలో ప్రదర్శించాలి. అనుమానాలు, సందేహాలు ఉంటే ప్రాజెక్టు మేనేజర్ లేదా సేఫ్టీ ఆఫీసర్‌ను సంప్రదించేలా అవగాహన కల్పించాలి. పుకార్లను వ్యాపింపజేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో బాధ పడుతున్న వారిని ఆస్పత్రికి తరలించడంతో పాటు 108 లేదా 104 నంబర్‌కు సమాచారం అందించాలి. పని ప్రారంభించే తొలి రోజు అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ► కార్మికవాడలో ఉండే కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేక నంబర్‌తో కూడిన ఫొటో గుర్తింపు కార్డు అందజేయాలి. ప్రతి కార్మికుడి వి వరాలతో రికార్డులు నిర్వహించాలి. కార్మికులు పని ప్రదేశం వదిలి బయటకు వెళ్లకుండా స్థాని కంగానే వారికి అవసరమైన నిత్యావసరాలు, ఇతరాలను సమకూర్చాలి. తప్పనిసరి పరిస్థితు ల్లో బయటకు వెళ్లాల్సి వస్తే సంబంధిత సూపర్వైజర్ అనుమతితో మాస్క్ ధరించి వెళ్లాలి. -
నిధులున్నా నిర్మించలేకపోయారు
సాక్షి, నెల్లిమర్ల(విజయనగరం) : జూనియర్ కళాశాల నూతన భవనాల నిర్మాణానికి 2013లోనే ప్రస్తుత ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు స్థలం కేటాయించారు. అప్పట్లోనే భవనాల నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరు చేయించారు. ఇంకా అదనంగా భవనాల నిర్మాణానికి రెండేళ్ల క్రితం సర్వ శిక్షాభియాన్ నిధులు రూ.2.6కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో టీడీపీ ప్రభుత్వం గత రెండేళ్లలో భవనాలను నిర్మించలేకపోయింది. దీంతో సమస్య యథాతధంగా మిగిలిపోయింది. నెల్లిమర్ల పట్ట ణంలో సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు బాలుర ఉన్నత పాఠశాల ఒకే ప్రాంగణంలో నడుస్తున్నాయి. ఆరు దశాబ్దాలుగా ఈ రెండు విద్యాసంస్థలు అరకొర భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. ఏడేళ్ల క్రితం వరకు ఉదయం పూట పాఠశాల, రెండోపూట కళాశాల నిర్వహించేవారు. అయితే పాఠశాలతో పాటు కళాశాలను రెండుపూటలా నిర్వహించాలని సంబంధిత అధికారులు ఆదేశించడంతో అప్పటి నుంచి రెండుపూటలా నిర్వహిస్తున్నారు. ఒకే ప్రాంగణంలో రెండు విద్యాసంస్థలు నిర్వహించడం, అరకొరగా భవనాలు ఉండటంతో ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు 2013లో కళాశాలకు ప్రత్యేకంగా భవనాలు నిర్మించేందుకు మిమ్స్ సమీపంలో రెండున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. ప్రాథమికంగా భవనాల నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరు చేయించారు. ప్రస్తుతం అవే భవనాల్లో ఆర్ట్స్ గ్రూపులకు సంబంధించిన తరగతులు నిర్వహిస్తున్నారు. కళాశాల అంతటికీ నూతన భవనాలు నిర్మించాలని అప్పట్లోనే ఎమ్మెల్యే బడ్డుకొండ ప్రణాళికలు రూపొందించారు. అయితే 2014లో ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. రెండేళ్ల క్రితం కళాశాల భవనాలకు సర్వ శిక్షాభియాన్ రూ.2.6కోట్లు మంజూ రు చేసింది. ఆ నిధులతో కళాశాలకు సంబంధించి 16 గదులతో పాటు ప్రహరీ, మరుగుదొడ్లు నిర్మించాలని తలంచారు. టెండరు కూడా ఖరారైంది. గత రెండేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఆ నిధులను వినియోగించలేకపోయింది. ఇప్పటికీ నూతన భవనాలను నిర్మించలేకపోయారు. దీంతో కళాశా ల తరలింపు ప్రక్రియ ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బడ్డుకొండ కల్పించుకుని నూతన భవనాలను వెంటనే నిర్మించేలా చర్యలు చేపట్టాలని పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కోరుతున్నారు. తద్వారా దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యను తీర్చాలని విన్నవిస్తున్నారు. -
నిర్మాణ కార్మికులు దొరకట్లేదు!
మియాపూర్‌లోని ఓ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కారణం, నిధుల్లేక కాదు.. లేబర్ దొరక్క! సార్వత్రిక ఎన్నికలని వెళ్లిన కార్మికులు తిరిగి రావట్లేదనేది కాంట్రాక్టర్ వాదన. పోనీ, స్థానిక లేబర్స్‌తో పనులను చక్కబెట్టేద్దామంటే? నైపుణ్య సమస్య! .. ఇది కేవలం ప్రైవేట్ డెవలపర్లే కాదండోయ్.. హౌసింగ్ ఫర్ ఆల్, కేసీఆర్ 2 బీహెచ్‌కే వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా గృహాల నిర్మాణం ఆలస్యమవుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం దేశీయ నిర్మాణ రంగంలో 5 కోట్ల మంది కార్మికులున్నారు. ఇందులో నైపుణ్యమున్న కార్మికులు 2 కోట్ల లోపే. పస్తుతం 6.42 లక్షల మంది సివిల్ ఇంజనీర్లు, 65 వేల మంది ఆర్కిటెక్ట్‌లు, 18 వేల మంది ప్లంబర్లు అందుబాటులో ఉన్నారు. 2022 నాటికి ఈ రంగంలో 8.3 కోట్ల మంది కార్మికులు అవసరం ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కార్మికులతో పాటూ ప్లానర్స్, ఇంజనీర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, సర్వేయర్స్, ఆర్కిటెక్ట్స్ వంటి అన్ని విభాగాల్లోనూ మానవ వనరుల అవసరం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 2 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌లో 70–75 వేల మంది నిర్మాణ కార్మికులుంటారు. గతంలో ఒంగోలు, శ్రీకాకుళం ప్రాంతాల కార్మికులు హైదరాబాద్ నిర్మాణ రంగంలో పనిచేసేవాళ్లు. కానీ, ప్రభుత్వ ఉచిత పథకాల కారణంగా చాలా వరకు కార్మి కుల వలస తగ్గిపోయింది. దీంతో బిహార్, మహారాష్ట్ర, కోల్‌కతా, వెస్ట్ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, అస్సాం, ఒరిస్సా రాష్ట్రాల కార్మికుల మీద ఆధారపడాల్సి వస్తుంది. కార్మికుల ధరలివే: రోజుకు మేస్త్రీకి రూ.700–900, లేబర్ (మగవారికి) రూ.450–500, ఆడవాళ్లకు 300–350, షటరింగ్కు చ.అ.కు రూ.12–14, రాడ్ బెండింగ్ టన్నుకు రూ.6,000. ఎందుకు తగ్గిపోయారంటే? ► ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లోనే నిర్మాణ పనులు జరుగుతుండటంతో మెట్రో నగరాలకు కార్మికుల వలస తగ్గింది. ► సార్వత్రిక ఎన్నికల కని వెళ్లిన కార్మికులు తిరిగి పనులకు రాకపోవటం. ► కార్మికుల్లో కష్టపడే తత్వం తగ్గిపోవటం. గ్రామీణ, పట్టణాల్లోని యువత ప్రధాన నగరాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లుగా పనిచేయడానికి ఇష్టపడకపోవటం. ► వేతన అసమానతలు, కఠినమైన పని షెడ్యూల్డ్స్, ప్రసూతి సెలవులు లేకపోవటం. ప్రతికూల వాతావరణ పరిస్థితులు. ► కనీస అవసరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తీరుస్తుండటం. ► ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, పింఛన్లు, బీమా, ఇల్లు ప్రభుత్వమే అందిస్తుండటం. కార్మికుల కొరతతో ఏమవుతుందంటే? ► ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్మికులు, అరకొర పనిముట్లతో పూర్తి స్థాయిలో నిర్మాణ పనులను చేయలేరు. ► కొనుగోలుదారులకు ఇచ్చిన గడువులోగా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాదు. నిర్మాణం నాణ్యత దెబ్బతింటుంది. ► కార్మికులు, నిర్మాణ వ్యయం పెరుగుతుంది. కాబట్టి దాని ప్రభావం కంపెనీ కార్యకలాపాల మీద పడుతుంది. అంతిమంగా స్థిరాస్తి ధరలు పెరుగుతాయి. ► కంపెనీలకు నైపుణ్యమున్న మానవ వనరుల నియామకం, శిక్షణ భారంగా మారుతుంది. టెక్నాలజీనే సరైన మందు.. నిర్మాణ పనుల్లో సాంకేతికతను వినియోగించడం ద్వారా కార్మికుల కొరతను అధిగమించవచ్చు. 80 శాతం కార్మికుల కొరతను టెక్నాలజీ భర్తీ చేస్తుంది. ఉదాహరణకు హై రైజ్ భవనాల్లో మైవాన్ టెక్నాలజీ, ప్రీ–కాస్ట్‌తో వాల్స్, కాలమ్స్, బీమ్స్ల ఏర్పాటు, రోబోటిక్స్‌తో పెయింటింగ్ వంటివి. నిర్మాణ పనుల్లో సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కూడా ముందుకురావాలి. పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. డెవలపర్ల సంఘాలతో కలిసి ప్రభుత్వం కార్మికులకు నైపుణ్య శిక్షణతో పాటూ పూర్తి స్థాయి పనిముట్లను సమకూర్చాలని సూచిస్తున్నారు. చిన్న, మధ్య స్థాయి డెవలపర్లకు చుక్కలే.. హై రైజ్ భవనాలు, ఒకే రకమైన గృహ సముదాయాలకు, కమర్షియల్ ప్రాజెక్ట్‌లకు మైవాన్ షటరింగ్ టెక్నాలజీ కరెక్ట్. చిన్న ప్రాజెక్ట్‌లకు ఈ టెక్నాలజీని వినియోగించలేం. ఎందుకంటే డెవలపర్లకు వ్యయం భారంగా మారుతుందని ఓ డెవ లపర్ తెలిపారు. నైపుణ్యమున్న కార్మికుల కొరత కారణంగా 100 మంది పనిచేయాల్సిన చోట 20 మంది మాత్రమే ఉంటున్నారని పేర్కొన్నారు. 7–8 అంతస్తుల్లోపు నిర్మాణాలు చేపట్టే 85 శాతం చిన్న, మధ్య స్థాయి డెవలపర్లకు కార్మికులు దొరక్క ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఆర్అండ్డీ అవసరం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోవటంతో పెద్ద ప్రాజెక్ట్‌లకు అందుబాటులో ఉన్నంత సులువుగా, సౌకర్యవంతంగా చిన్న, మధ్య స్థాయి డెవలపర్లకు అందట్లేదు. ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థలు మేనేజ్మెంట్తో పాటూ నిర్మాణ సాంకేతికత మీద కూడా పరిశోధనలు చేయాల్సిన అవసరముంది. – ఇంద్రసేనా రెడ్డి, ఎండీ, గిరిధారి హోమ్స్ ప్రీ–కాస్ట్ గృహాల మీద అవగాహన కల్పించాలి ప్రధాన నగరంలో ప్రీ–కాస్ట్ తయారీ యూనిట్లను నెలకొల్పి.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు ఉత్పత్తులను సరఫరా చేయాలి. ఇందుకోసం ప్రభుత్వం, డెవలపర్ల సంఘాలు ముందుకురావాలి. ప్రీ–కాస్ట్ గృహాల అన్ని రకాల వాతావరణ పరిస్థితులు తట్టుకోవనో లేదా నాణ్యత విషయంలోనో ప్రజల్లో ఉన్న అపోహను తొలగించాలి. ఇందుకోసం డెవలపర్ల సంఘాలు, ప్రభుత్వం విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలి. – సీ రామచంద్రా రెడ్డి, జనరల్ సెక్రటరీ, క్రెడాయ్ రెరా, జీఎస్టీ, బినామీ ట్రాన్స్యాక్షన్ యాక్ట్ వంటి చట్టాలతో దేశంలో రియల్టీ లావాదేవీలు పారదర్శకత, వేగం, జవాబుదారీతనం పెరిగింది. దీంతో ఎన్ఆర్ఐ వ్యక్తిగత పెట్టుబడులు, ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. బెంగళూరు, ముంబై, చెన్నై, పుణె, హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్ వంటి ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్, మాల్స్, గ్రేడ్–ఏ ఆఫీస్‌లు, కో–వర్కింగ్ ప్రాపర్టీలకు డిమాండ్ ఉంది. -
నాణ్యమైన నిర్మాణాలకే ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సదుపాయాలు లేకపోయినా ఫర్వాలేదు. ఆట స్థలాలకు స్థానం కల్పించకున్నా ఇబ్బంది లేదు. విస్తీర్ణం తక్కువైనా నో ప్రాబ్లమ్. అందుబాటు ధర.. నిర్మాణంలో నాణ్యత ఉంటే చాలు.. నగరంలో ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ ప్రాపర్టీ పోర్టల్ సర్వే తెలిపింది. సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకొని అందుబాటు ప్రాజెక్ట్‌లను నిర్మించాలని సూచించింది. మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయని సర్వే చెబుతోంది. దీంతో బడా డెవలపర్లూ అందుబాటు గృహాల వైపు దృష్టిసారించారు. ఆర్థ్ధిక మాంద్యం కారణంగా ప్రవాస భారతీయులు, ఐటీ ఉద్యోగుల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో తక్కువ విస్తీర్ణ ఇళ్లకు, స్థానిక కొనుగోలుదారులకు అందు బాటు ఇళ్లకు శ్రీకారం చుట్టాయి. ♦ నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి. ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ వంటి ప్రాంతాల్లో రూ.25 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడుమంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారి సంఖ్య తక్కువగా ఉంది. నేటికీ హైదరాబాద్ నిర్మాణ రంగం ఐటీ ఉద్యోగుల కొనుగోళ్ల మీదే ఆధారపడి ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే నగరంలో రేట్లు తక్కువగా ఉండటం. పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నగరం వైపు దృష్టిసారిస్తున్నారు. -
భారత్‌లో 3.5 కోట్ల మంది ఉద్యోగాలకు ఎసరు!
-
భారత్‌లో 3.5 కోట్ల మంది ఉద్యోగాలకు ఎసరు!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ప్రధాన రంగాల్లో ఈ రంగం ఒకటిగా ఎదిగిన విషయం తెల్సిందే. ఈ రంగంలో చోటు చేసుకుంటున్న రోబోఠఙక్ సాంకేతిక పరిజ్ఞానం మరో 30 ఏళ్ల నాటికి యాభైశాతం కార్మికులను రోడ్డున పడేయనుంది. ముఖ్యంగా 2025 సంవత్సరం నాటికి భవన నిర్మాణ రంగంలో భారత్ ప్రపంచంలోనే మూడవ దిగ్గజ దేశంగా ఎదుగుతున్న అంచనాల నేపథ్యంలో కార్మికుల పట్ల ఇది ప్రతికూల పరిణామమే. న్యూయార్క్‌లోని ఓ కంపెనీ తయారు చేసిన సెమీ ఆటోమేటిక్ మిషన్లు (ఎస్ఏఎం) ఇప్పటికే ఇటుక గోడల నిర్మాణంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. ప్రస్తుతం వీటిని అమెరికాలో ఉపయోగిస్తుండగా, త్వరలోనే బ్రిటన్‌లో ఉపయోగించనున్నారు. మానవులు రోజుకు 500 ఇటుకలతో కూడిన గోడను నిర్మించగలిగితే ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్లు రోజుకు 3000 ఇటుకలతో గోడలను నిర్మించగలుగుతున్నాయి. ఈ విషయంలో పెర్త్‌లోని ఓ రోబోటెక్ కంపెనీ ఇంతకన్నా అధునాతనమైన రోబో యంత్రాలను కనిపెట్టాయి. ప్రయోగాత్మక పరీక్షలు కూడా విజయవంతం అవడంతో ఆ కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి వీటిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటోంది. ఇటుక గోడల నిర్మాణానికి రానున్న దశాబ్దం మొత్తం రోబోటిక్ యంత్రాలదేనని ఇదే ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్న స్విడ్జర్లాండ్ పరిశోధకులు తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన ఇంజనీర్ హాడ్రియన్ రెండు రోజుల్లో ఇంటిని నిర్మించే రోబో యంత్రాలను 2015లో డిజైన్చేసి వాటి మీద పని చేస్తున్నారు. అవి కూడా మార్కెట్లోకి వచ్చినట్లయితే ఈ రంగం మీద ఆధారపడి బతుకుతున్న కార్మికులకు మరింత ప్రమాదం. ప్రస్తుతానికి రోబోలను పని చేయించడానికి కొంత సిబ్బంది అవసరం అవుతున్నారు. పోనుపోను సిబ్బంది అవసరం లేకుండానే రోబోలే అన్ని పనులు చేసుకుంటూ పోతాయట. ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న 30 ఏళ్లలో భారత్‌లో మూడున్నర కోట్ల మంది కార్మికులు రోడ్డున పడతారని నిపుణుల అంచనా.