పాకిస్తాన్ పర్యటలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. రావల్పిండి వేదికగా జరుగుతున్న పాకిస్తాన్‌తో తొలి టెస్టులో లివింగ్‌స్టోన్ టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా లివింగ్‌స్టోన్ మోకాలికి గాయమైంది.
ఈ క్రమంలోనే లివింగ్‌స్టోన్ దూరం కానున్నాడు. ఇక ఇదే విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ కూడా దృవీకరించింది. "లివింగ్ స్టోన్ మోకాలి గాయం కారణంగా మిగిలిన టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అతడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము" అని ఇంగ్లండ్ క్రికెట్ ట్విటర్‌లో పేర్కొంది. కాగా అరంగేట్ర టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఏడు పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
ఇక పాకిస్తాన్-ఇంగ్లండ్ తొలి టెస్టు రసవత్తరంగా జరుగుతోంది. ఈ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ అఖరి రోజు ఆటకు చేరుకుంది. ఇంగ్లండ్ విజయానికి 7 వికెట్ల దూరంలో నిలవగా.. పాకిస్తాన్ గెలుపొందాలంటే మరో 174 పరుగులు సాధించాలి. ఐదో రోజు లంచ్ విరామం సమయానికి పాకిస్తాన్ మూడు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.
Get well soon, liaml4893.
— England Cricket (@englandcricket) December 5, 2022
The all-rounder has been ruled out of the rest of our Test series in Pakistan.
🇵🇰 #PAKvENG 🏴
Comments
Please login to add a commentAdd a comment