Liam Livingstone Injury: Liam Livingstone Doubt For England Opening Match In T20 World Cup 2021 - Sakshi
Sakshi News home page

T20 World Cup: అసలు పోటీకి ముందు.. ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ!

Published Tue, Oct 19 2021 10:20 AM | Last Updated on Wed, Oct 20 2021 4:52 PM

T20 World Cup: Liam Livingstone Doubt For England Opening Match - Sakshi

Liam Livingstone (Photo Credits: Sky Sports).

Liam Livingstone Injury: టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో తమ ప్రయాణానికి ముందు ఇంగ్లండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియాతో జరిగిన సోమవారం నాటి వార్మప్‌ మ్యాచ్‌ సందర్భంగా... ఆల్‌రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. భారత జట్టు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో 16వ ఓవర్‌లో జోర్డాన్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌ షాట్‌ ఆడాడు. బంతిని ఒడిసిపట్టడంలో విఫలమైన లివింగ్‌స్టోన్‌ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు మైదానాన్ని వీడాడు. లివింగ్‌స్టోన్‌ స్థానంలో... సామ్‌ బిల్లింగ్స్‌ గ్రౌండ్‌లోకి వచ్చాడు.

ఈ నేపథ్యంలో 24 గంటలు గడిస్తే గానీ.. లివింగ్‌స్టోన్‌ గాయం గురించి ఏమీ చెప్పలేమని ఇంగ్లండ్‌ జట్టు అధికార ప్రతినిధి వెల్లడించారు. దీంతో.. అక్టోబరు 23న డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడో లేదోనన్న అంశంపై స్పష్టత లేకుండా పోయింది. కాగా వార్మప్‌ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్‌ 2 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్‌ తీసి సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌ విజృంభించడంతో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. బుధవారం న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్‌ ఆఖరి వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది.

చదవండి: T20 World Cup: సంభాషణలు ఇలాగే ఉంటాయి మరి.. కోహ్లి, ధోని ఫొటో వైరల్‌!

ఇంగ్లండ్‌- సూపర్‌ 12, గ్రూప్‌-1
ఇయాన్‌ మోర్గాన్‌, మొయిన్‌ అలీ, జొనాథన్‌ బెయిర్‌స్టో, సామ్‌ బిల్లింగ్స్‌, జోస్‌ బట్లర్‌, టామ్‌ కరన్‌, క్రిస్‌జోర్డాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, డేవిడ్‌ మలన్‌, ఆదిల్‌ రషీద్‌, జేసన్‌రాయ్‌, డేవిడ్‌ విల్లే, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌వుడ్‌.
రిజర్వు ప్లేయర్లు: లియామ్‌ డాసన్‌, జేమ్స్‌ విన్స్‌, రీస్‌ టోప్లే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement