
పుణె: శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన పేసర్ నవదీప్ సైనీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. రెండో టీ20లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న సైనీ.. మూడో టీ20లో కూడా మెరిశాడు. రెండో టీ20లో రెండు వికెట్లు, మూడో టీ20లో మూడు వికెట్లతో సత్తాచాటాడు. 145 నుంచి 150 కి.మీ వేగంతో బంతుల్ని సునాయాసంగా సంధిస్తున్న సైనీ.. ప్రత్యర్థి శ్రీలంకను హడలెత్తించాడు. శుక్రవారం చివరి టీ20లో భారత్ గెలిచి సిరీస్‌ను 2-0తో గెలిచిన తర్వాత మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును అందుకునే క్రమంలో మాట్లాడిన సైనీ.. తన బౌలింగ్‌లో వేగం అనేది సహజంగానే వచ్చిందన్నాడు.(ఇక్కడ చదవండి: అందులో వాస్తవం లేదు: కోహ్లి)
‘నేను వైట్ బాల్ బంతితో ఆడటానికి ముందు రెడ్ బాల్‌తో ఎక్కువగా ఆడేవాడిని. ఎర్రబంతితో బౌలింగ్ చేయడం కష్టంగా అనిపించేది కాదు.. కానీ వైట్ బాల్‌తో బౌలింగ్ చేయడానికి మాత్రం ఎక్కువ శ్రమించే వాడిని. వైట్ బాల్‌తో ఎక్కువ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు సులువుగానే అనిపిస్తోంది. నా బౌలింగ్‌ను మెరుగుపరుచుకున్న తర్వాత వైట్ బాల్‌తో బౌలింగ్ ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదు. నా సీనియర్లు నుంచి తీసుకున్న సలహాలు ఎక్కువగా ఉపయోగపడ్డాయి. ఏయే పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలో వారు నాకు చెబుతున్నారు. నా జిమ్, నా డైట్ తర్వాత భారత్‌కు క్రికెట్ ఆడటం అనేది నా గోల్. దాదాపు నాలుగైదేళ్ల నుంచి రెడ్ బాల్‌తో ఆడుతున్నా. అంతకుముందు టెన్నిస్ బాల్‌తో ప్రాక్టీస్ చేసేవాడిని’ అని సైనీ పేర్కొన్నాడు.(ఇక్కడ చదవండి: సామ్సన్ చాలా మిస్సయ్యాడు..!)
Comments
Please login to add a commentAdd a comment